Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘వైకుంఠపాళి’ – కొత్త ధారావాహిక – ప్రకటన1

తెలుగువారి అభిమాన రచయిత్రి ‘బలభద్రపాత్రుని రమణి’ రచించిన ‘వైకుంఠపాళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

మాళవికకి నందినిని చూస్తున్నకొద్దీ తనేం పోగొట్టుకుందో తెలిసింది.

“నందినీ… నందినీ డార్లింగ్!” అంటూ శశిధర్ ఆమెని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా వెంట తిరుగుతున్నాడు.

ఇద్దరూ కళ్ళతో చిలిపి సైగలూ, నవ్వులూ… ప్రపంచంలోని ఆనందం అంతా వాళ్ళే స్వంతం చేసేసుకున్నట్లు కనిపించారు.

ఓ రెండు గంటలు వాళ్ళతో కలిసి గడపడం మాళవికకి కష్టం అయిపోయింది.

“నే వెళ్తానే!” అంది.

“ఆగు… ఈ రాత్రికి వుండిపో” అని నందిని బలవంతం చేసింది.

మాళవిక శశిధర్ వైపు చూసింది.

తెల్లని లాల్చీ పైజామాలో దృఢంగా అందంగా వున్న అతని చూడగానే అతని ద్వారా తను పొందిన అవమానం గుర్తొచ్చింది.

***

ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో… వచ్చే వారం నుంచి.

Exit mobile version