- భాషా కృషీవలుడు
- సామాజిక మాధ్యమాలే వేదిక
- వంద వారాలుగా అప్రతిహతంగా కార్యక్రమాల నిర్వహణ
పట్నాయకుని వెంకటేశ్వరరావు వృత్తిలో పాత్రికేయుడే అయినా, ప్రవృత్తిలో భాషా కృషీవలుడు. నిజానికి ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, అకాడమీలు పూనుకొని నిర్వహించాల్సిన భాషా పరిరక్షణ, భాషోద్ధరణ కార్యక్రమాలను ఎలాంటి సాయం లేకున్నా, అన్నీ తానే అయి నిర్వహిస్తున్న ఏక వ్యక్తి సైన్యం ఆయన. తెలుగు పలుకు మీద, తెలుగు పలుకుబడి మీద గల అపారమైన మక్కువే ఆయనను ఇంతటి బృహత్తర భాషా యజ్ఞానికి పురిగొల్పింది.
ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికగా ఆయన వారం వారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతివారం వివిధ రంగాలలోని ప్రముఖులను తన ఇంటికి ఆహ్వానించి, వారితో తెలుగు భాషా వైభవ, వికాసాలపై చర్చలు నిర్వహిస్తూ, ఫేస్‌బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈ చర్చా కార్యక్రమాల కోసం ఇంటికి వచ్చిన చిన్నా పెద్దా అతిథులందరినీ ఇతోధికంగా సంప్రదాయబద్ధంగా సత్కరించి, భోజనం పెట్టి మరీ సాగనంపుతున్నారు. ఆయన కొనసాగిస్తున్న `వారం వారం తెలుగుహారం` కార్యక్రమ పరంపరకు మార్చి ఒకటో తేదీతో వంద వారాలు పూర్తవుతున్నాయి. వనరులు కలిగిన సంపన్న సాహితీ సంస్థలకే సాధ్యంకాని ఘనతను పట్నాయకుని వెంకటేశ్వరరావు అవలీలగా సాధించగలిగారంటే, తెలుగు భాషపైన ఆయనకు గల మక్కువ, తెలుగు భాషా పరిరక్షణపై ఆయనకు గల నిబద్ధత ఏ స్థాయిలో ఉన్నవో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఈ కార్యక్రమ లక్ష్యాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం…
- ప్రతీ ఇల్లూ తెలుగుకు పెద్ద పీట వేయాలి
- తెలుగు భాష, సంస్కృతి, పద్యం, పాట, నాటకం,సామెతలు, నుడికారాలు, అవధానం వంటి అన్ని ప్రక్రియలను కొత్త తరం పిల్లలకు తెలియచేసి భాషా మమకారం పెంచడం.
- మన మాతృభాష కొన్ని వందల తరాలకు తరలి వెళ్లేలా తెలుగు కుంటుంబాలు
- కృషిచేసేలా ప్రేరణ కలిగించడం.
- ప్రతీ ఆదివారం ఉదయం 11 గంటలనుంచి 12 గంటల వరకూ ఈ కార్యక్రమాన్ని నా ఫేస్‌బుక్ వేదికపై నిర్వహిస్తూ ఉన్నాను.
- ఫేస్‌బుక్‌లో ఉన్న 902 మంది మిత్రుల్లో అధికులతో పాటు కొత్తగా చాలామంది ఈ కార్యక్రమాన్ని ప్రతీ వారం క్రమం తప్పకుండా చూస్తున్నారు. ఇలా 10వేలకు పైగా వీక్షకులు దీన్ని చూశారు.
- మారిషస్‌దేశంలోనూ , బెంగళూరు, నిజామాబాద్‌ల్లో కొందరు మిత్రులు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని తమ ఇళ్ల వద్ద పిల్లలకు లైవ్‌లో చూపుతున్నారు.
- మారిషస్,మలేసియా, ఆస్ట్రేలియా, కతార్, అమెరికాలోని తెలుగు మిత్రులు కూడా ఈ వీడియోలను చూసి వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
- వ్యక్తిత్వ నిర్మాణానికి వినియోగపడే వేమన పద్యాలకు ముమ్మర ప్రచారం కల్పించడం.
- సందర్భోచితంగా ఆయా వారాల్లో సాగిన కార్యక్రమాలు, సంఘటనల వివరాలు అందించడం. మార్కెట్‌లోకి వచ్చిన పుస్తకాలపై వివరాల అందజేత.
- తెలుగు భాషా చర్చను సాగించి ప్రతీ ఒక్కరిలో ప్రేరణ రగిలించి మాతృభాషా వికాసానికి ఉద్యమస్ఫూర్తితో పనిచేయడం.
- ఒక సీనియరు జర్నలిస్టుగా, రచయితగా, కవిగా ఇది నా విద్యుక్త ధర్మంగానూ అక్షర రూపంలో ఉన్న సరస్వతిని ఆరాధించడం నా ప్రథమ లక్ష్యంగా భావిస్తున్నాను.
ఇది ఫేస్‌బుక్ వేదికగా తెలుగుకోసం సాగుతున్న ఏకైక ప్రయోగం… ఆధునిక మాధ్యమాల ద్వారానే యువతరాన్ని ఆకట్టుకొని వారిని తెలుగుకు చేరువ చేయాలన్నది లక్ష్యం.
ఒక చిన్న ఆలోచనతో ప్రారంభం
ఇక నేను అడిగిన తడవుగానే ఎలాంటి భేషజాలు చూపకుండా ఇంటికి వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకున్న అతిథులు. ఫోన్ ద్వారా ముచ్చటించి కార్యక్రమంలో తెలుగు భావాలను పంచుకున్న పెద్దలకు వందనాలు. ఇలా ఇప్పటికి 66 మంది తెలుగు ప్రముఖులు, కవులు, రచయితలు, పెద్దలు ఇందులో ముచ్చటించారు. వీరిలో 45 మంది ప్రముఖులు ఇంటి వద్దకు వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరో 21 మంది శ్రీకాకుళం, విశాఖ,అనంతపురం, కడప, కర్నూలు, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్‌లనుంచి ఫోన్ ద్వారా ముచ్చటించి చక్కని తెలుగుకు చిక్కని బాటలు వేశారు. ఇక నేను వ్యక్తిగత వ్యాఖ్యానం ద్వారా 200 వేమన పద్యాలు, 100 వరకూ తెలుగు దనం నింపే పద్యాలు, 100 సామెతలు, 300 నుడికారాలు, తెలుగు విశేషాలు, తెలుగు ప్రముఖుల ముచ్చట్లు, సందర్భోచితంగా కొత్త అంశాలు వీక్షకుల ముందు ఉంచాను. ఇవి కూడా ముమ్మరంగా షేర్ అయ్యాయి. వేలమంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగా నూ చూశారు. దీనికి అనుబంధంగా యూట్యూబ్‌లో నడుస్తున్న ‘వీఆర్ తెలుగు చానల్’ ద్వారా 40వేల వరకూ వీక్షకులు ఆదరించారు. ముఖ్యంగా తెలుగు విశేషాలు కొత్త తరానికి చేర్చాలనే సంకల్పంతో సాగుతున్న ఈ మహత్తర వినూత్న కార్యక్రమం మీ ముందుకు తెస్తున్నందుకు దీనికి మీ ఆదరణ తోడుగా నిలుస్తున్నందుకు ఒడలు పులకరిస్తోంది. ఓ జర్నలిస్టుగా అక్షరాన్ని ఆరాధించి అమృత తుల్యమైన మన మాతృభాషా సేవలో ఇలా అడుగులు వేస్తున్న ఈ సరికొత్త ప్రయోగానికి సదా మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను..
ఈ కార్యక్రమంపై ‘సాక్షి’, హన్స్ ఇండియా పత్రికలు కథనాలు రాసి ప్రోత్సహించాయి.
ఇంటికి వచ్చిన అతిథులు వీరే…
1. సంజీవ నరసింహ అప్పడు (మారిషస్ దేశ విద్యాధికారి) 2. సన్నిధానం నరసింహశర్మ (సాహితీ ప్రముఖుడు),3. సత్యసాయి విస్సా (విస్సా చారిటబుల్ ట్రస్ట్ అధినేత) 4.రత్నాల నరసింహమూర్తి (సీనియర్ జర్నలిస్టు),5. వర్థనపు సుధాకర్ (డీడీ ఖజానా శాఖ, విశాఖ), 6. పి. లక్ష్మణ్ (వ్యక్తిత్వ వికాస నిపుణుడు,మహబూబ్ నగర్), 7. పోకల సుబ్బారెడ్డి (వ్యక్తిత్వ ప్రేరకుడు, కర్నూలు), 8. కుడికాల వంశీ (యువకవి) 9. డి.వి. ఆర్. భాస్కర్ (సీనియర్ జర్నలిస్టు), 10.ఆర్. మధుసూదన రావు (కథకుడు, సినీగేయ రచయిత), 11. బాబూ చారి (గాయకుడు), 12. సత్యప్రియ (భారత్ టీవీ ప్రతినిధి), 13. సప్తగిరి (ఏబీఎన్ చానల్ ప్రతినిధి), 14. శ్రీదేవి (యూనిసెంట్ స్కూల్, తెలుగు విభాగ అధిపతి), 15. మక్కపాటి మంగళ (స్వర్ణపుష్పం పత్రిక ఎడిటర్) 16. కాలువ మల్లయ్య (సాహితీ ప్రముఖుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు),17. దవలూరి కిశోర్ (వ్యాఖ్యాత, సాక్షి టీవీ) 18. అద్దంకి వాణిశ్రీ (కవి, పటాన్‌చెరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని,)19.డా. వకుళాభరణం కృష్ణమోహన్ (తెలంగాణ రాష్ట్రం బీసీ కమిషన్ సభ్యుడు, సాహితీవేత్త),20.దాసరి వెంకటరమణ(సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బాలల కథారచయిత) 21. కుప్పిలి విజయకుమార్ రెడ్డి(సమైక్యభారతి తెలంగాణ శాఖ అధ్యక్షుడు), 22. శ్రీనిధి (యువ కవయిత్రి), 23 సామల ఫణికుమార్ (యువకవి), 24. సీవీ రమాదేవి (ప్రిన్సిపల్ యూనిసెంట్ పబ్లిక్ స్కూల్), 25.వసంత్ నారాయణ (సాఫ్ట్‌వేర్ నిపుణుడు), 26.బీఏల్ ప్రసాద్ (విశ్రాంత సీనియర్ మేనేజర్,ఆంధ్రాబ్యాంకు), 27. కుప్పిలి శ్రీలత (వ్యక్తిత్వ వికాస బోధకురాలు), 28.చిత్తలూరి సత్యనారాయణ (ఉభయ భాషా కవి, రచయిత), 29 ఇందూ రమణ (ప్రముఖ కథకుడు, నవలారచయిత), 30. ఆనందరావు పట్నాయక్(కథకులు, రాయగడ),31. శ్రీ ఎంవీ రామిరెడ్డి (ప్రముఖ కథకుడు) 32. శ్రీ ప్రభాకర రెడ్డి (విశ్రాంత ఐఏఎస్), 33. శ్రీ టి.గౌరీ శంకర్ (తెలుగు వర్సిటీ విశ్రాం రిజిస్ట్రార్),34. శ్రీ చెన్నూరు సీతా రాంబాబు (ఏఐఆర్), 35.శ్రీమతి పి.వైజయంతి (సీనియర్‌జర్నలిస్టు),36. కుమారి ఆర్. కీర్తన (గాయకురాలు), 37. శ్రీ.పిఎస్ విశేష్ (సైకాలజిస్టు),38. శ్రీమతి ప్రశాంతి (గాయని).39.శ్రీ వాకిటి రామిరెడ్డి (జానపద గాయకుడు),40.శ్రీ రామదుర్గం మధుసూదనరావు (నన్ను ఇంటర్వ్యూ చేశారు). 41.శ్రీ సృజన్‌రావు (జర్నలిస్టు), 42.శ్రీ కుడికాల జనార్ధన్ (కవి, రచయిత,వరంగల్), 43. శ్రీ ఇనాయ్ తుల్లా (కర్నూలు).44.శ్రీ యు. విజయకుమార్ పట్నాయక్(విశాఖ). 45. శ్రీ సాధన నరసింహాచార్యులు (ప్రముఖ సాహితీ కార్యక్రమాల నిర్వాహకుడు) లు ముఖ్య అతిథులుగా వచ్చి తెలుగు భావాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు.
ఫోన్ ద్వారా ముచ్చటించిన వారు…
1. సన్నశెట్టి రాజశేఖర్ (ఎడిటర్ ఉత్తరాంధ్ర పత్రిక,శ్రీకాకుళం),2.భద్రి కూర్మారావు (జానపద కళా ప్రముఖుడు, డిగ్రీ కళాశాల ఉపన్యాసకుడు, శ్రీకాకుళం 3. సాయి ప్రశాంతి (గాయని విశాఖ పట్నం) 4.శ్యామసుందర శాస్త్రి (రేడియో వ్యాఖ్యాత,అనంతపురం) 5.జాబిలి భాషా (కవి,ఎడిటర్ జాబిలి పత్రిక , పెనుగొండ), 6. ఈశ్వర రెడ్డి ( ఆచార్యుడు, వేమన వర్సిటీ, కడప),7.ఇనాయ్ తుల్లా (కవి, రచయిత, గాయకుడు, కర్నూలు) 8. మహ్మద్ మియా (గజల్ గాయకుడు, కర్నూలు), 9. కెంగర మోహన్( కవి, రచయిత కర్నూలు), 10, నాగమణి (అధ్యాపకురాలు,కవి, ఎమ్మిగనూరు) 11. అమూల్య (కవి,రచయిత్రి విజయవాడ),12. నామా సుజనా దేవి (రచయిత్రి సిద్దిపేట) 13. కుడికాల జనార్థన్ (ప్రఖ్యాత కవి, రచయిత, వరంగల్) 14. అత్తలూరి అరుణ (జర్నలిస్టు, హైదరాబాద్), 15. నందిగాం శివప్రసాద్ (సినీ సంగీత దర్శకుడు, హైదరాబాద్) 16. సంజీవ నర్సింహ అప్పడు (మారిషస్) 17. జంద్యాల రఘుబాబు (కవి, రచయిత, కర్నూలు), 18. శ్యామ్ ప్రసాద్ లాల్ (జేసీ, కరీంనగర్), 19. ఎం. హరికిషన్ (ప్రఖ్యాత బాలల కథకుడు, కర్నూలు), 20.శ్రీ ఏడీఆర్ నాయుడు (మలేసియా), 21. శ్రీ కస్తూరి మురళీకృష్ణ (సంచిక నిర్వాహకుడు) వంటి వారు ఫోన్ ద్వారా ముచ్చటించి కార్యక్రమానికి వన్నె తెచ్చారు.