వర్షంలో తడవడం
వర్షపు శబ్దం వినడం
ఒకటి జల్లుల కావలింత
ఇంకోటి చినుకు సవ్వడుల గిలిటింత
మధ్యలో నేనున్నానంటూ
మట్టీ, దాని సువాసన
చిరు చినుకుల పలకరింత ఒక వైపు
మన్ను పులకరింత ఇంకోవైపు
కళ్ళు మూసుకుని గొంతెత్తి
నేలపై త్రిశంకు స్వర్గాన్ని
ఆస్వాదించే వరం పొందిన నేను
కానా దేవుళ్ళ కన్నా మిన్న
నింగిపై వెలిగే గంధర్వులకి
దొరకని గని నాదేనన్నా!