[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘వైబ్రెంట్ విజిల్స్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అవి
అక్కడ ఎన్నో తరాలుగా
చూస్తున్నవి నన్ను
కరుగని శిలను కదా కదలలేను మరి!
పాదాలను తాకినా
మనిషిగ మారొచ్చు అవి
కానీ కలుషిత పర్యావరణ గుండె
విష ఆవరణలో
అది కదిలినా కాంచలేని కథ!
మనసు
తేరగవచ్చే పునరుక్తి మళ్ళీ మళ్లీ
పొర్లుదండాల నగిషీలు
బాహువులు కరువైన వైకల్యం
కవిత రాయగ కూర్చున్న
తగిలింది నా కాళ్ళకు పోట్రాయి దీనంగా
చైతన్యంలో అవిప్పుడు
నిన్నటి మిత్రుల మరిచిన నేలలో
కొత్తమిత్రులు, శక్తుల పరవశం
మైక్రోస్కోపిక్ విజనరీ స్పర్శ కోసం
సర్వేంద్రియాలు వేసే వైబ్రెంట్ విజిల్స్

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.