[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]
నిరహం (కొనసాగింపు)
In her most controversial non-fiction book, The Virtue of Selfishness..
“In popular usage,” Ayn Rand wrote, “the word ‘selfishness’ is a synonym of evil. The image it conjures is of a murderous brute who tramples over piles of corpses to achieve his own ends.. and pursues nothing but the gratification of the mindless whims of any immediate moment.
“Yet the exact meaning and dictionary definition of the word ‘selfishness’ is: ‘concern with one’s own interests.’
“This concept does not include a moral evaluation. It does not tell us whether concern with one’s own interests is good or evil. Nor does it tell us what constitutes man’s actual interests. It is the task of ethics to answer such questions.”
అదే విధంగా Selflessness is one of the biggest evils. And altruism is the result of it. ఐన్ ర్యాండ్ ప్రకారం ఈ selflessness, altruism అనేవి పెద్ద contradictions. అసలు మనిషి అన్నవాడు తన గురించి, తన పని గురించి, తన జీవనం గురించి ఆలోచిస్తాడు. ఆలోచించాలి. అందరూ చేసే పని కూడా అదే. ఈ విషయంలో ఇతరులతో పని ఉండదు. వారి ప్రమేయం ఉండదు. ఉండరాదు.
కానీ, మన జనాలకు వారి గురించి వారు ఆలోచించటంకన్నా, ఇతరుల గురించిన ఆలోచనలే ఎక్కువ. అవతలవారు ఏమి చేశారు? చేస్తున్నారు? చేయబోతున్నారు అన్న వాటి మీదే చింత. ఇది కాకపోతే అవతలవారు తన గురించి ఏమి అనుకుంటున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు అనే ధ్యాస. అసలు సగటు మనిషికి కేవలం తన ఆలోచనల సహాయంతో, తన స్వంత ఆలోచనలను ఉపయోగించుకుని, తన జీవితాన్ని చక్కదిద్దుకుంటం రాదు. ఎవరోకరి influence తప్పకుండా ఉంటుంది. అది అందరి మీదా ఉంటుంది కదా అనే ప్రశ్న ఠక్కున ఉదయిస్తుంది. నిజమే. కానీ, సగటు మనిషికి validation from others or society యావ ఎక్కువ.
Peer pressure. Fear of missing out (FOMO). Fear of Losing Chances (FOLC). Show off. ఇన్ని అవలక్షణాలు కుప్పలుగా ఉంటాయి. వాడిలాగా నువ్వు పైకి రావాలి. ఎన్నిసార్లు వినలేదు ఆ మాట?
తనికెళ్ళ భరణి స్వరంలో చదువుకోండి: ఆ అమ్మాయిని చూసి నేర్చుకోరా! చదువుల్లో ఫస్టు. సంగీతంలో ఫస్టు.
ఇవన్నీ నిజానికి part of many forms of selflessness.
స్వ, స్వీయ, నా, నాదైన.. ఇలాంటివాటికి వ్యతిరేకం. అనుసరించటమే కాదు. వారు ఇలా చెప్పారు కనుక నేను ఎందుకు చేయాలి? అని వ్యతిరేకంగా చేయటం కూడా ఈ జబ్బులో భాగమే. ఇవన్నీ మనం మన రోజువారీ జీవితాల్లో గమనించేవే. కానీ పట్టించుకోనివే. చెత్తను చెత్త కుండీలో పోయాలి. కానీ అంత దూరం వెళ్ళలేము. ముందు ఎవడో వచ్చి పక్కనున్న ఖాళీ స్థలంలో పోసి వెళ్తాడు. జనాలు కూడా అదే ఫాలో అవుతారు. చిన్నతనంలో మనం హోమ్వర్క్ చేయకపోయే వచ్చే భయం పక్కనోడు కూడా చేయకపోతే వచ్చే ఆనందం ముందు దిగదుడుపే.
కానీ వీటికన్నా ప్రభావవంతంగా Ayn Rand తన నవల The Fountainhead లో Selflessness గురించి పీటర్ కీటింగ్ పాత్ర ద్వారా చెప్తుంది.
Men have been taught that the ego is the synonym of evil, and selflessness the ideal of virtue. But the creator is the egoist in the absolute sense, and the selfless man is the one who does not think, feel, judge or act. These are functions of the self.
పీటర్ కీటింగ్ తన తప్పుకు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాడు. అతను చాలా స్వార్థపరుడని తనకు తానుగా చెప్పుకుంటున్నాడు. కానీ నిజానికది స్వార్థం కాదు. నిరహం. Lack of the Self in his personality. అతని ఏ చర్యలో లేదా ఆలోచనలో తన స్వంతమైనది ఎప్పుడూ లేదు. అమ్మ చెప్పిందనో, తన gal friend Catherine Halsey అన్నదనో, తరువాత తరువాత Ellsworth Toohey ద్వారా లాభపడాలనో చూశాడు తప్ప, ఇది నాది. ఇది నా నిర్ణయం. ఇది నేను. నేను అనుకున్న విధంగానే, నాకు నచ్చినట్లు, నా ప్రోద్బలంతోనే చేస్తున్నాను. ఈ విధంగా ఎప్పుడూ లేడు. జీవితంలో అతని లక్ష్యం ఏమిటి? గొప్పతనం!!! – అది కూడా ఇతరుల దృష్టిలో.
కీర్తి, అభిమానం, అసూయ – ఇతరుల నుండి వచ్చేవన్నీ. ఇతరులు తన గురించి ఏమి అనుకున్నారు? అనుకుంటున్నారు. అనుకోవాలి? దానికి తాను ఏమి చేయాలి? ఇవే అతని ప్రధాన motivation factors. తనకు లేని virtues, natural gifts ఉన్నాయని ఇతరులు అనుకోవాలి అని అతను కోరుకున్నాడు. దాని కోసమే తన పనులను సాగించాడు. ఇతరుల అభిప్రాయమే ఇతనికి అతని ప్రేరణ శక్తి. అతను గొప్పగా ఉండాలని కోరుకోలేదు, కానీ గొప్పగా భావించబడాలని కోరుకున్నాడు. అతను నిర్మించాలని కోరుకోలేదు, కానీ గొప్పగా నిర్మిచాడని ఇతరులు అనుకోవాలి అని కోరుకున్నాడు. తన అహానికి, తన స్వ కు అతను ద్రోహం చేసుకున్నాడు. అందుకు మూల్యం చెల్లించాడు. ఈ నిరహాన్నే జనాలు స్వార్థం అనుకున్నారు.
ప్రతి నీచమైన చర్యకు మూలం నిరహమే కారణం కాదా? స్వార్థం ఎన్నడూ కారణం కాదు, కానీ కచ్చితంగా స్వ అనేది లేకపోవటం. తన సొంతం కాని విజయానికి క్రెడిట్ తీసుకునే వ్యక్తి. అతను సాధారణ వ్యక్తి అని తెలుసు, కానీ అతను ఇతరుల దృష్టిలో గొప్పవాడు అని అనిపించుకోవటానికి కావలసిన ఎత్తులన్నీ వేశాడు. అదే అతని దౌర్భాగ్యం.
మరి ఈ నిరహం అనంతరామ శర్మలో ఏ మోతాదులో ఉంది? అతనిలో ఉన్న inner Peter Keating అతనిని ఎలా దెబ్బకొట్టాడు?
అవన్నీ సరే! మరి గంగాధరం ఎవరు?
(కలుద్దాం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య