Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వినయం-అభయం

హంకారం తలకెక్కినా,
ఆత్మవిశ్వాసం అడుగంటినా,
మనిషి జీవనం అగమ్యగోచరం,
అంతం తెలియని పయనం!!

అహంకారంతో అందలాలెక్కినా,
కలసిరాని కాలం వెక్కిరిస్తే,
అందలం అధః పాతాళమై,
ప్రశంసలన్నీ, విమర్శలుగా మారి..
జీవితమే ఏహ్యమవుతుంది!!

ఎదురుదెబ్బలు కాచుకోలేక,
ఆత్మవిశ్వాసం కరువైతే..
చిన్న పామే విషసర్పమవుతుంది,
భయమే జీవితమవుతుంది!!

విజయం తెప్పించే వినయం,
కష్టాలకు ఇచ్చే స్వీయ అభయం,
జీవితాంతం అవసరం-
అవి కరువైన జీవితం వ్యర్థం!!

 

Exit mobile version