Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వినీల.. పున్నమి

[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘వినీల.. పున్నమి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నీవు
వెన్నెలలో కురిసే
మంచు పూల వర్షంలా
నీవు
సందెవేళ కమ్మిన
మధన వేధనా మేఘంలా
నీవు
తొలిపొద్దు పూచిన
సుగంధ వన సుమంలా
ఊపిరిపోసే
నీ.. వలపు వాయువులు తాకి..
కనువిందుచేసే
నీ.. చూపుల రవ్వలు పడి..
ప్రేమ కాసారంలో
మునిగి..
విలాప గీతం పాడే
వినీల.. పున్నమిని

Exit mobile version