యువ రచయితల్లో సృజనాత్మక రచనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎస్వీ యూనివర్సిటీ ప్రాచ్యపరిశోధనా సంస్థ సౌజన్యంతో, సాహితీ స్రవంతి మరియు వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యశాల నిర్వహించబడనుంది.
ఈ కార్యశాల 2026 ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఎస్వీ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో జరుగుతుంది.
ఉదయం 9:30 గంటలకు ప్రాంరంబంలోకార్యశాల ఉద్దేశ్యాలను సాహితీ స్రవంతి కన్వీనర్ ఓ. వెంకటరమణ వివరించనున్నారు.
కార్యశాలలో భాగంగా వర్తమాన సాహిత్యం, దాని ధోరణులు, కవిత్వ నిర్మాణ పద్ధతులు, కథా రచన నిర్మాణం, కథలు–కవితల సమీక్ష తదితర అంశాలపై ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, అధ్యాపకులు ప్రసంగించనున్నారు.
కథా, కవితా రచనలపై ప్రధాన వక్తలుగా ఎస్వీ యూనివర్సిటీ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య రాజేశ్వరమ్మ, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, సీనియర్ జర్నలిస్టు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత పలమనేరు బాలాజీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర, ప్రాచ్య పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఆచార్య పీ.సి. వెంకటేశ్వర్లు, ప్రముఖ కథారచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు పాల్గొంటారు.
యువ రచయితలతో ప్రత్యక్ష చర్చలు, వారి స్పందనలు, సందేహ నివృత్తి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
కథా, కవితా రచనపై ఆసక్తి ఉన్న యువ రచయితలు ఈ కార్యశాలలో పాల్గొని అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు మల్లారపు నాగార్జున, నడ్డి నారాయణ, సాయి లక్ష్మి, పత్తిపాటి రమేష్ నాయుడు, మహేష్ బాబు, తాతయ్య కోరారు.
పాల్గొనేవారు 25-04-2026 లోపు 9398000686/ 94945 12930 నంబర్లకు వాట్స్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు.
వేమన విజ్ఞాన కేంద్రం
సాహితీ స్రవంతి, తిరుపతి

