Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

Wednesday

[ముహమ్మద్ ఎల్ కుర్ద్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Mohammed El-Kurd’s poem titled ‘Wednesday’ by Mrs. Geetanjali.]

~

(విషాదంలో ఉన్న మనిషేమి నృత్యం చేస్తున్న ఎలుగుబంటి కాదు ! -ఎయిమ్.సెసాయిర్)

~

కొత్తగా పుట్టిన శిశువు కళ్లల్లో మృత్యువు కనిపిస్తోంది.
ఆ పసిపాప మోసపూరితమైన ఓటమిని గురించి ఆరోపించడం విన్నాను.
ఎప్పటినుంచో కొనసాగుతున్న పాత ఉపద్రవమే ఇది అంటుంది.
పాప చెవుల్లో హోరు మాత్రం నిశ్శబ్దం కోసమే ఈ విధ్వంసం అంటుంది.
పాప మూగదైనప్పుడు ఉరుములు ఉవ్వెత్తున వస్తాయి.
ఎంత దుర్భరమైన దశ ఇది?
అతను కొంచెం ముందుకు తప్పుకున్నాడు
నీ గమ్యం ముందే నిర్ణయించబడినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు?
*
ఈ ఆసుపత్రిలో జీవితం మమ్మల్ని చూసి నవ్వుతుంది.
ఎంత దీర్ఘకాల నిరీక్షణ ఇది?
గాలి భీకరంగా వీస్తున్నది.
ఎక్కడైనా పెళ్ళేమైనా జరుగుతున్నదా ?
నర్స్ మబ్బులు కమ్ముతున్నాయని అంటోంది.
నేనో పిచ్చి పూవునైతే.. వర్షంలో తడిసి నలిగిపోయే దాన్ని.
వాళ్ళామెను ఈ చిన్ని పువ్వుకేమైంది ఇలా నలిగిపోయిందని అడిగారు.
వాళ్ళడగాల్సింది ఏంటి..
ఈ అదుపులేకుండా కురిసే
వర్షాన్ని కదా?

~

మూలం: ముహమ్మద్ ఎల్ కుర్ద్ (Mohammed El-Kurd)

అనువాదం: గీతాంజలి


మొహమ్మద్ ఎల్-కుర్ద్ పాలస్తీనాలోని జెరూసలేంకి చెందిన కవి, రచయిత. అతని రచనలు – ది గార్డియన్, దిస్ వీక్ ఇన్ పాలస్తీనా, అల్-జజీరా ఇంగ్లీష్, ది నేషన్, ఇంకా రాబోయే వాక్యూమింగ్ అవే ఫైర్ ఆంథాలజీ మొదలైన వాటిలో ప్రచురితమయ్యాయి.

మహ్మద్ సవన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ నుండి B.F.A. తో పట్టభద్రుడయ్యాడు. అక్కడ అతను రాడికల్ బ్లాంకెట్స్ అనే అవార్డు-విన్నింగ్ మల్టీమీడియా కవిత్వ పత్రికను నిర్వహించాడు. అతను ప్రస్తుతం M.F.A చదువుతున్నాడు.

బ్రూక్లిన్ కళాశాల నుండి కవిత్వంలో. అతని పొయెటిక్-ఔడ్ ఆల్బమ్, బెల్లీడాన్సింగ్ ఆన్ వుండ్స్, పాలస్తీనియన్ సంగీత కళాకారిణి క్లారిస్సా బిటార్ సహకారంతో విడుదలైంది. కవిత్వం, రచనలతో పాటు, ఎల్-కుర్డ్ ఒక విజువల్ ఆర్టిస్ట్, ప్రింట్ మేకర్, ఇంకా, ఫ్యాషన్ కలెక్షన్ కో-డిజైనర్ కూడా.

Exit mobile version