Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యుద్ధం – శాంతి

[డా. సి. భవానీదేవి రచించిన ‘యుద్ధం – శాంతి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

యుద్ధం చేసేది ఎందుకు
రక్తదాహానికి సమాధానమా
విధ్వంసపు పొదలో పువ్వులు పూస్తాయా?
గుండెల మంటల్లో గానాలు పుడతాయా?
ఖడ్గం చెప్పే న్యాయం నిశ్శబ్ద చాలనమా?
తూటాలు రాసే చరిత్ర విజయమా?
జెండాల నీడలో జనాల కన్నీళ్లు
జయగీతాల శబ్దాల్లో వినిపిస్తాయా?
శత్రువు ముఖంలో మనం కనిపిస్తున్నామా
భయం అద్దంలో ప్రతిబింబం కాదా?
సరిహద్దుల గీతలు మనసుల్ని చీల్చి
మానవత్వాన్ని మరిచిపోతాయా?
శాంతి అంటే నిశ్చల నదిలా
మాటలతోనే వంతెన కట్టడమా?
గాయాల మీద గౌరవం పెరగాలంటే
క్షమ కంటే పెద్ద లేపనముంటుందా
విజయం అంటే ఊపిరి నిలవడమా?
ఓటమి అంటే జీవితం కూలడమా?
యుద్ధం కాక శాంతే లక్ష్యమైతే
మనిషే గెలిచిన కథ అవుతుంది.
మానవాళికి కొత్తపాఠం నేర్పుతుంది

Exit mobile version