[జోసెఫ్ ఫసానో గారు వ్రాసిన Words Found in the Rubble After the Final War అనే కవితని ‘యుద్ధానంతర శిథిలావశేషాలలో శేషోక్తులు’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ నాగరాజు రామస్వామి.]
అవును నిజమే,
మేము చీకటి రోజులలో జీవించాం;
కాని,
ఏమీ చేయలేక పోయాం.
మండుతున్న ఆకాశం కేసి చూచాము;
ఆ జ్వాలలు స్వయంకృతాలేనని గ్రహించాము.
మేము మా ప్రతి శ్వాసను వృథా చేశాము.
పిల్లలారా!
మీలో ఎవరైనా ఇంకా బ్రతికే వుంటే
దయచేసి మా వినతి వినండి;
చీకటి తోటలోంచి నెమ్మది నెమ్మదిగా బయటకు రండి
ఉదయ పవనాలలో ఒండొరుల ముఖాలను స్పృశించుకుంటూ,
పేరు పేరున పిలుచుకుంటూ.
ఆంగ్ల మూలం: జోసెఫ్ ఫసానో.
స్వేచ్ఛానువాదం: నాగరాజు రామస్వామి.
