[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘యుద్ధం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
యుద్ధమంటే
జన నష్టం
ధన నష్టం
ఒక యుద్ధం
పాఠాలెన్నో
నేర్పుతుంది
యుద్ధమంటే
బతుకు బరువు
మెతుకు కరువు
ఒక యుద్ధం
గాయాలెన్నో
చేస్తుంది
వద్దు వద్దు
యుద్ధ భ్రాంతి
కోరుకుందాం
విశ్వశాంతి
