Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యుద్ధం

[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘యుద్ధం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

యుద్ధం అంటే
అద్దం కాదు,
పదే పదే
చూడటానికి.

ప్రాణాలు పోతే
తిరిగి రావు
మరోసారి
బ్రతకడానికి

పెంచుకొన్న
సాంకేతికత
అమాయక ప్రాణాలను
తీయడానికా?

ఎన్నుకున్న నాయకుల
నిర్ణయాలు నరులను
బలి పశువుల్ని
చేయడానికా?

ఓ యుద్ధమా, చేయు
నాయకుల మదిలో
అంతర్యుద్ధం చూపు
విధ్వంసమే నీ పర్యవసానం

వీలైతే చేయు
ఒక సహాయం
ఆపు నీ యుద్ధం
మేలుకొలుపు
విశ్వశాంతికి ఉదయం

Exit mobile version