Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యువత

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘యువత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

సోమరితనం ఒక చెడు నడత
దాన్ని నిర్మూలించుకోవాలి యువత

వ్యసనాలతో వ్యవస్థకు కలత
సద్భావనతో మెలగాలి యువత

గొప్ప విద్యా ప్రమాణాలకు కొలత
కావాలి జ్ఞాన సంపన్నులుగా యువత

విశ్వంలో వినిపించాలి మన ఘనత
లక్ష్య సాధనతో సాగిపోవాలి యువత

ఔన్నత్యానికి నిదర్శనం యువత
ప్రగతికి మూలాధారం యువత

Exit mobile version