[డా. గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన ‘ఆలు మగలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


సృష్టిపునాది
తీగల మొక్కలు
కలయిక
గురుతైన
సంత (తి) ఉన్నా లేకున్నా
బతుకున
సౌఖ్యాలున్నా
కష్టాలున్నా
కొమ్మంటూ
ఆకై కాయయ్
ఎదిగినంత ఎదిగి పైపైకి
లోలోన ఒదిగి
కనిపించని వేర్లలా
దిగినంత దిగి
లోపలికి
(భు)వనాన్ని
హృద్యమానవోద్యాన యోగ్యంగా
మార్చుతున్న
(జీ)వన దేవతలు