తనది కాని భూమిలో
రెక్కల కష్టం చేసి –
పలితం కోసం –
ఆకాశం చూసే
ఆశాజీవి
కౌలు రైతు!!
విధి వెక్కిరించినా,
ప్రకృతి కన్నెర చేసినా,
తన కష్టం నేలపాలు –
భూమి యజమాని
దయా దాక్షిణ్యం కోసం
వేడుకోలు!!
కాయకష్టమే
పెట్టుబడిగా-
ప్రకృతిపై
నమ్మకమే జీవితంగా
బ్రతికే అనధికార
ఉద్యోగి
కౌలు రైతు!!
రుణం మాఫీ అయినా,
రైతు బంధు అయినా,
రైతు సంక్షేమ పథకం
అయినా-
అనుభవించలేని
దురదృష్టవంతుడు
ఈ కౌలు రైతు!!
పుండు మీద పుట్ర-
నకిలీ విత్తనాలు,
సారంలేని ఎరువులు.
అన్నిటినీ అధిగమించి
చేతికివచ్చే ఫలసాయం
గుర్రంపై స్వారీ –
కౌలు రైతు
జీవితంపై సవారీ!!
సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.

