[డా. జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన ‘ఆంధ్ర ధరిత్రి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
దేశభాషల లెస్స జ్ఞానపీఠము దీప్తి రామగాథ ధరిత్రి
విశ్వంభరఖ్యాతి భరతఖండాంతరాంధ్ర ప్రసిద్ధి ధరిత్రి
త్రిలింగదేశముగ చారిత్రిక ప్రసిద్ధి
శ్రీకాకుళాంధ్ర విష్ణువు పృథివిది ప్రసిద్ధి
అమరావతీ శైవక్షేత్ర బౌద్ధ నాగార్జునునికి ప్రసిద్ధి
శాలివాహన శకకర్త కీర్తి ఆంధ్రజాతిది దివ్య ధాత్రి
ఋగ్వేదమున ప్రసిద్ధి, వేద పురాణేతిహాస చరిత్ర ప్రసిద్ధి
అమరజీవి పొట్టి శ్రీరాములు తఫః ఫలమాంధ్ర ధరిత్రి
చాళుక్యులు, నాయకప్రభువులు ధీశక్తి మంత్రులు
శ్రీకృష్ణరాయల ప్రభువు స్వర్ణయుగ పాలనల సర్వ సర్వంసహము..
రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఇరువదారు జిల్లాలు తెలుగు ప్రదేశము
విశాల యశశ్చంద్రికల నేల నాలుగు చెరలు ఆంధ్రప్రదేశము
స్వాదునీరములిచ్చు సకల సన్నదుల
సకలర్తుసంశోబి సస్యాలవాల
వనచయములు ఖనిజవరుల సంపత్తి జలనిల్వలానకట్టల,
వంతెనల విద్యుదుత్పత్తి కేంద్రాల వెలుగులు పలకరింతలు
ఇరువదారు జిల్లాల ప్రకృతి సౌందర్య పులకితాంకితములు
రంగత్తరంగ జీవనదులు.. శివజటాజూట గంగాప్రవాహాలు..
గోదావరి కృష్ణ తంగభద్రా పెన్న..
సర్వఋతు శోభినులు.. సాగరుని భామినులు
రైతన్న పండించు సస్యశ్యామల భూమి పన్నీరు సిరులు
భరతమాతధరిత్రి అన్నపూర్ణ ధరిత్రి.. కళింగ త్రిలింగక్షేత్ర ఆంధ్రవిశాలాక్షి
మడమ త్రిప్పని పోతగడ్డు.. యోగులు దానకర్ణులు పతివ్రతలు వీరవనితలు
వీరసంసృతీ చరిత్రలు వెలనాడు పలనాడు, పులకింత లా
రాజరాజనరేంద్ర రాణ్మహేంద్రవరము పావనాశ్రమవాటిభారతము ఆంధ్రధరిత్రి
కవిత్రయము సాహితీసమరాంగణము భువనవిజయము.. లలతకళలు మేటికీర్తి..
గిడుగు వావహారికము దారి..
గురజాడ ముత్యాలసరము చేబూని
కవిజనసంకల్పకల్పకశాఖి వందేమాతరం.. జనగణమనగీత జాతీయజండా..
ఎదిరిగుండియ ప్రిదులంగ నెగిరిన పింగళి వెంకయాంధ్ర వందనీయ స్ఫూరి సాక్షి..
భిన్నత్వమేకత్వ తెలుగు ఐక్యత మల్లెపూదండ గీతి, ఆంధ్ర ధరిత్రి గీతి
సంగీతసాహిత్య సహిత్యసంసృతల కీర్తి
సాంకేతికజ్ఞానపరిపూర్ణ శాస్త్రప్రగతి పురోగతి
చేనేతవస్త్రములు హస్తకళ నిపుణములు.. విశ్వవినుత చలనచిత్రము..
ధరణి హవణిల్లును యర్హపూజ
విప్లవము గర్జనలు వందేమాతరం సన్నిహిత సన్నిహితులు
స్వాతంత్ర్య సమరయోధులకు హారతులు.. జాతిపితశాంతి సమరవిజయగాథలు
వచనగళమగును ఆంధ్ర ధరిత్రి
డా. జొన్నలగడ్డ మార్కండేయులు కవి, కథా రచయిత. వృత్తి రీత్యా కళాశాలలో తెలుగు ఉపన్యాసకులు. వీరు వ్రాసిన కథలు అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
