Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భారతమాత ప్రశ్న-13

[శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘భారతమాత ప్రశ్న’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 13వ భాగం.]

~

భారతమాత ఆశీర్వచనం

నేను భారతమాతను..
నా పిల్లలారా..
మీరు
గుడి కట్టకపోయినా పరవాలేదు.

ఒక గుండెను
పగలగొట్టకండి.

మీరు
వేల శ్లోకాలు
చదవకపోయినా పరవాలేదు.

ఒక ఆకలిని
మరిచిపోకండి.

మీరు
ఎన్ని విజయాలు
సాధించినా..

మానవత్వాన్ని
ఓడిపోనివ్వకండి.

ఎందుకంటే..

దేశం అంటే మట్టి కాదు..
దేశం అంటే మనుషులు.

జెండా అంటే బట్ట కాదు..
దాన్ని నిలబెట్టిన త్యాగాల శ్వాస.

భారతమాత అంటే విగ్రహం కాదు..
ప్రతి భారతీయుడి అంతరాత్మ.

“ఈ దేశం ఎవరిది అని అడగకు..
ఈ దేశానికి నీవెంతవాడివో ప్రతిరోజూ నిరూపించు.”

“భారతం భూభాగం కాదు..
మానవత్వం శ్వాసించే మహాయజ్ఞం.”

(సశేషం)

Exit mobile version