Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చీకటి రాత్రుల్లో

చీకటి రాత్రుల్లో
తెలియని దారుల్లో
ఎవరి కోసం వెతుకుతున్న
ఆగిపోకు కాలమా
ఆశ తీరే వరకూ
జారిపోకు మేఘమా
జల్లు కురిసే వరకూ
రాలిపోకు పుష్పమా
చేరువ అయే వరకు

మనసు తలుపు తెరిచి చూడు
దాచుకున్న ఈ ప్రేమని.
మనసు పడి చెబుతున్న
పదిలమైన ఈ మాటని విను
ఎంతకాలం ఈ ఎడారి జీవితమని.
ప్రశ్నిస్తోంది ఈ పుష్పం
ఎన్ని వసంతాలు నిలవాలని.
నిలిచే మొగ్గ అడుగుతోంది
ఎన్ని ఋతువులు ఆగాలని.
మర్చిపోకు మిత్రమా
ప్రాణం వస్తున్నంత వరకు.

Exit mobile version