రేపటిని సరికొత్తగా ఆవిష్కరించాలనుకుంటూ..
ఎన్నోకలలు కంటాం.. ఇలా చేయాలి.. అలావుండాలి..
అనుకుంటూ.. ప్రణాళికలు రచిస్తుంటాం..
కదా..!
ఆశలూ, ఆశయాలు ఫలించాలంటే..
నేటి రోజును సరిగ్గా వినియోగించుకుంటూ.. సాగిపోతుంటే..
ఎన్నో ప్రయత్నాలు, మరెన్నోపోరాటాలు.. జీవితగమనంలో
శక్తివంచన లేకుండా చేస్తుంటే ..
రేపన్నది ఎప్పుడైనా ..
ఆశలనూ, ఆశయాలనూ తప్పకుండా నెరవేర్చే ..
‘మదురమైన రోజు’ గా చిగురిస్తుంటుంది!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.