Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరునవ్వు

పెదవుల
నృత్య భంగిమ
చిరునవ్వు..

నగుమోము పై
వెలకట్టలేని ఆభరణం నీవు..

నీతో పలకరింపు
ఆత్మీయతతో నిండిన తేనేపలుకు..

నీతోనే అందం,
ఆనందం,ఆహ్లాదం..

గుర్తొచ్చిన జ్ఞాపకాలకు,
అనుకోని అతిథి నీవు..

నగుమోము పై పూసిన
అత్యంత అందమైన అలంకరణ నీవు

నీ రాకతో నిండిన వదనం
నిర్మలాకాశంలో చంద్రబింబం వలే ప్రకాశించు..

నీవు లేని మోముపై
ఎంతటి అలంకరణ ఉన్న వ్యర్థమే!!

Exit mobile version