Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా క్విజ్-8

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ‘నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా’ అనే పాట ఘంటసాల, పిఠాపురం పాడినది ఏ చిత్రంలో?
  2. సావిత్రి దర్శకత్వం వహించిన ‘మాతృదేవత’ సినిమాకు మాతృక అయిన హిందీ చిత్రం ఏది?
  3. 1960లో విడుదలైన ‘పెళ్ళికానుక’ చిత్రం తమిళంలో ఏ పేరున వచ్చింది?
  4. ‘నిత్యకళ్యాణం-పచ్చ తోరణం’ సినిమా హిందీ ఏ పేరున వచ్చింది?
  5. అక్కినేని నాగేశ్వరరావు, అంజలి నటించిన ‘ఇలవేలుపు’ చిత్రంలోని వీరి పాత్రలను హిందీలో ఎవరు పోషించారు?
  6. జెమినీ వారి ‘ఆడబ్రతుకు’ (ఎన్.టి.ఆర్) చిత్రానికి హిందీ మాతృక ఏది?
  7. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దొంగరాముడు’ చిత్రం ఏ పేరున హిందీలో వచ్చింది? హిందీలో కథానాయకుడు ఎవరు?
  8. ఎ.ఎన్.ఆర్, సావిత్రి నటించిన ‘మంచి మనసులు’ చిత్రం హిందీలో ఏ పేరున వచ్చింది?
  9. కె.ఎస్. గోపాలకృష్ణన్ కథతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘తోడు-నీడ’ సినిమాకి ఏ తమిళ చిత్రం ఆధారం?
  10. హిందీ చిత్రం ‘గృహస్తీ’ ఆధారంగా తెలుగులో వచ్చిన అక్కినేని చిత్రం ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 నవంబరు 01వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 8 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 నవంబరు 06 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 6 జవాబులు:

1.విమల 2. అశోకన్ 3. పావమన్నిప్పు 4. రిస్తేనాతే 5. నిర్దోషి 6. దిలీప్‍కుమార్, దేవానంద్ 7. భాగ్యరేఖ 8. అమరదీపం 9. ఇరుగుపొరుగు 10. పెంకిపెళ్ళాం

సినిమా క్విజ్ 6 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version