Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దృష్టి దాటిన దృష్టి

[శ్రీనివాస్ మంత్రిపగడ గారి ‘దృష్టి దాటిన దృష్టి’ అనే కవితని అందిస్తున్నాము.]

సగం కళ్ల తోనే నడిచే ఈ లోకంలో,
పూర్తి నిజం మాత్రం
హృదయపు అంరరాళంలో దాగి ఉంటంది.
దాన్ని తెలిపేది చూపు కాదు..
ఒక నిమిషం నిశ్శబ్దం,
ఒక చుక్క కరుణ,
ఒక చిలుకు వెలుగు.

ఎవరూ చూడని మార్గాల్లో
మనం ఒక్కసారిగా పాదముద్రలు వేయించేది
దైవం పంపిన అంతర్దృష్టి

ఆలోచన రూపంలో పుట్టిన కాంతి.
అది వచ్చినప్పుడు
అడుగు అడుగూ ప్రశ్నలతో నిండిన జీవితం
ఒకే సమాధానంతో నిండిన పయనమవుతంది.

సరికొత్త చూపు జన్మించే క్షణంలో
భూమి తిరిగే ధోరణి మారినట్లుంటుంది.
నిన్నటి అడ్డుగోడ
ఇవాళ స్వర్గానికి తలుపవుతంది;
అదే క్షణాన్ని ఋషులు ‘ఉపదేశం’ అంటారు,
కవులు ‘ప్రేరణ’ అంటారు,
మనం మాత్రం ‘అహా!’ అని ఊపిరి తీసుకుంటాం.

జీవిరం చెబుతంది –
“నిజం ఎప్పుడూ దాగి ఉండదు,
నీ చూపు మాత్రమే ఆలస్యంగా మేలుకుంటుంది.”
అప్పుడు తెలుసుకుంటాం..
విశ్వం ఎప్పటినుంచో మనతోనే మాట్లాడుతుందని,
కానీ మనం వినడానికి మనసే లేకపోయందని.

దృష్టి – అందరూ చూస్తేనే నిజం కాదు;
ఎవరూ చూడని చోట
దేవుడు నీకు చూపించే క్షణమే నిజమైన దర్శనం.
అదే క్షణం నీ ప్రయాణానికి దీపస్తంభం,
నీ చీకట్లకు జన్మించిన మొదటి కాంతి.

Exit mobile version