తనువంతా ఎర్రదనం నింపుకొని
మృదువైన రేకులు కప్పుకొని
సుగంధం వెదజల్లుతోంది
దూరాన ఉన్న ఆ గులాబీ పువ్వు
ఓసారి తాకుతానని చేయి వేస్తే
గుచ్చుకుంది ముల్లు నొచ్చుకుంది పువ్వు
చేతినుండి అదే ఎర్రని రంగు రక్తం
జర జరా కారింది, పూరేకుల నుండి
హిమబిందువులేమో రాలాయి కొన్ని
అవి పుష్పాశ్రువులా…రోదిస్తుందా ఆ విరి
ఇంత సొగసున్న తనకి అస్పృశ్యత అని
ఇది ఓ గులాబీ విలాపము
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.