Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్తగా ఇంకొన్ని

~
న్నాళ్లీ విరిగిపోతున్న పాత జండాకర్రలను
అతుకు పెట్టుకుని తిరుగుదాం

ఎన్నాళ్లీ వెలుగారుతున్న పాత సూర్యుళ్ల
పేరు చెప్పుకుంటూ వెలుగుదాం

తేనె ఇంకుతున్న పట్టులను పిండుతూ
ఎన్నాళ్లు నిరాశపడదాం
పొందలేని ఆనందాన్ని నటిద్దాం

ఈ కూలిపోతున్న కోటలను
చరిత్రల పేరుతో చూస్తూ ఎన్నాళ్లిలా ఉండిపోదాం
నాయకమ్మన్యులందర్నీ నాయకులని పిలుచుకుందాం

ఒక కొత్త లోకం సృష్టిద్దాం
చీకటి అంచులు దాటుకు కొత్త కోటల మీద
కొత్త జండానొక కొంగొత్త సూర్యుడిలా ఎగరేద్దాం
కనులముందు విస్తరిస్తున్న కొత్త ఆశల ప్రపంచానికి
ఎవరూ విని ఎరుగని ఒక కొత్త పేరు పెడదాం

Exit mobile version