[శ్రీ డి. వినాయకరావు గారు రచించిన ‘లవ్ జిహాద్’ అనే పద్య కవితని అందిస్తున్నాము. సంచిక నిర్వహించిన లవ్ జిహాద్ కవితలో పోటీలో బహుమతి పొందిన కవిత.]
~
ఆవె:
ప్రేమ యుద్ధమంటు పిచ్చి కూతలు కూయు
మతము మార్చ ప్రేమ మైకమందు
మోసగాళ్ల వలలొ పూబోడి చిక్కెనా
మగ్గిపోవు తాను మసలలేక
ఆవె:
ప్రేమ గుడ్డిదంటు పిచ్చిగా మారగన్
పేరు ఊరు లేని ప్రేమికుండ్రు
చెప్పరాని పనులు చెయ్యంగ నిర్వురున్
తప్పు యెవరి దంటు చెప్పు టెట్లు?
కం:
ప్రేమను ప్రకటించు నపుడు
యేమేమో చెప్పుతుండ్రు యెర్రిగమారిన్
కామము కళ్లను మూయగ
క్షేమంబులు మర్వ బ్రతుకు ఖేదమునొందున్
కం:
పిల్లలు హద్దులు మీరిన
తల్లీ తండ్రన్నవారు తగదని జెప్పన్
అల్లరి కావుగ బ్రతుకులు
యెల్లరు క్షేమంగ నుంద్రు యెరుగగ యువతన్
5ఆవె:మతము మార్చ బూని మనువాడు మనుషులు
మేకవన్నె పులులు లోకమందు
ప్రేమ వలను విసిరి బెల్లింపు మాటలు
చెప్పుచుంద్రు వారుచెరచ చెలిని
ఉ:
గుడ్డిగ నమ్మబోకుమిల కుత్తుక కోయును ప్రేమపేరుతో
దుడ్డును నాశజూపు చెలి ధూర్తులు మార్చ మీమతమ్ములన్
చెడ్డను చేరదీయకుము జిడ్డుగమారుతు తొల్గబోక నీ
కడ్డగు ప్రేమపిచ్చదియు ఖండనజేయగ జీవితమ్ములన్
మ:
వనితా మేలుకొనమ్మ జీవితము నాభాసొందు నమ్మంగ ప్రే
మను పన్నే నవమోసగాళ్లు, మతమున్ మార్పించు విధ్రోహులన్
కనుమా వంచకులందు మోసమును దిక్కారించ రుద్రాణివై
రణమున్ జేయము కుట్రనాపగను ధైర్యంజూపి నీరక్షకై
కం:
మతపిచ్చిలోన కొందరు
మితమును దాటుదురు వారు మిత్రత మరిచిన్
కథలవి ప్రేమా పెళ్లని
వెతలను సృష్టింప జెప్పు వెర్రిగ మార్చన్
డి. వినాయక రావు నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ పద్య కవి మరియు విద్యావేత్త.
1963 ఆగస్టు 4న లోకేశ్వరంలో జన్మించిన వీరు, ప్రస్తుతం భైంసా నివాసిగా ఉంటూ సాహిత్య మరియు విద్యా రంగాల్లో విశేష సేవలందిస్తున్నారు. వీరు కీ.శే. యశోదాబాయి, కీ.శే. శ్రీనివాసరావు దంపతుల కుమారుడు. వీరి భార్య శ్రీమతి వీణారాణి; ఈ దంపతులకు రాకేష్, రోహిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరు ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ మరియు ఉపాధ్యాయ శిక్షణలో మాస్టర్స్ పూర్తి చేశారు.
భైంసాలోని వివిధ ప్రైవేట్ ఆంగ్ల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిగా 30 సంవత్సరాల పాటు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల (భైంసా)లో ఆంగ్లోపన్యాసకుడిగా 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించారు.
పుస్తక పఠనం, పద్య-గద్య కవితలు రాయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్న వీరు సాంప్రదాయ పద్య సాహిత్యంలో, ముఖ్యంగా శతక ప్రక్రియలో విశేషమైన కృషి చేశారు. వీరి కలం నుండి జాలువారిన ప్రముఖ ముద్రిత శతకాలు మరియు భక్తి రచనలు – పండరీశ శతకము, వినాయక శతకము, శ్రీ దుర్గ వైభవ శతకము, షిరిడి సాయిబాబా శతకము, కదిలి పాప హరేశ్వర శతకము, శ్రీరామ పద్యమంజరి.
