సంచికలో తాజాగా

డి. వినాయకరావు Articles 1

డి. వినాయక రావు నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ పద్య కవి మరియు విద్యావేత్త.

1963 ఆగస్టు 4న లోకేశ్వరంలో జన్మించిన వీరు, ప్రస్తుతం భైంసా నివాసిగా ఉంటూ సాహిత్య మరియు విద్యా రంగాల్లో విశేష సేవలందిస్తున్నారు. వీరు కీ.శే. యశోదాబాయి, కీ.శే. శ్రీనివాసరావు దంపతుల కుమారుడు. వీరి భార్య శ్రీమతి వీణారాణి; ఈ దంపతులకు రాకేష్, రోహిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

వీరు ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ మరియు ఉపాధ్యాయ శిక్షణలో మాస్టర్స్ పూర్తి చేశారు.

భైంసాలోని వివిధ ప్రైవేట్ ఆంగ్ల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిగా 30 సంవత్సరాల పాటు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల (భైంసా)లో ఆంగ్లోపన్యాసకుడిగా 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించారు.

పుస్తక పఠనం, పద్య-గద్య కవితలు రాయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్న వీరు సాంప్రదాయ పద్య సాహిత్యంలో, ముఖ్యంగా శతక ప్రక్రియలో విశేషమైన కృషి చేశారు. వీరి కలం నుండి జాలువారిన ప్రముఖ ముద్రిత శతకాలు మరియు భక్తి రచనలు - పండరీశ శతకము, వినాయక శతకము, శ్రీ దుర్గ వైభవ శతకము, షిరిడి సాయిబాబా శతకము, కదిలి పాప హరేశ్వర శతకము, శ్రీరామ పద్యమంజరి.

All rights reserved - Sanchika®