మేఘం
వాన చుక్కగా మారింది
విత్తు వొడి
మెత్తగా విచ్చుకుంది
జననం నుంచి
మరణం వరకు
తిరిగేదంతా
ఈ మట్టి చుట్టే
మొక్క పెరిగింది
మృత్తిక తల్లి చలువన
అదే
తల్లి బిడ్డల బంధం
మట్టిని నమ్ముకున్న
దేశ వెన్నెముకలు
తాగుతున్నాయి
ఎండ్రిన్ సీసాలు
మట్టిని నమ్ముకోలేక
అమ్ముకుంటున్నాడు
మనిషి రూపాన
భస్మాసురుడు
ఒంగోలుకు చెందిన శింగరాజు శ్రీనివాసరావుగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజరుగా 2015 సంవత్సరంలో పదవీవిరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టారు. వీరు వ్రాసిన కథలు, కవితలు.. ఆంధ్రభూమి, స్వాతి, రమ్యభారతి, సాహితీకిరణం, విశాఖ సంస్కృతి, విశాలాక్షి, హాస్యానందం, ఉషా వంటి వివిధ పత్రికలలోను, సంచిక, తపస్వి మనోహరం, సుమతి, కథామంజరి, గో తెలుగు, నెచ్చెలి, సహరి, షార్వాణి, రవళి వంటి మరికొన్ని అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో కథలు, కవితలు బహుమతులను పొందాయి. ఫోన్ 9052048706

