[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 26.
ఎందుకంటే.. మనవాళ్లకు కల్మశం లేదు. ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే చాలు.. అక్కున చేర్చుకోవడం అన్నది మన రక్తంలోనే ఉన్నది. వసుధైక కుటుంబం, లోకా స్సమస్తా సుఖినోభవంతు లాంటి మాటలు అప్పటికే మనకు నూరిపోశారు కాబట్టి.. సహజంగానే అందరిలోనూ మంచినే చూస్తాం. అట్లాగే శరణార్థులుగా వచ్చిన సిరియన్ క్రైస్తవులను కూడా కేరళ పుత్రులైన చేర రాజులు చేరదీశారు.
భారతదేశ రాజవంశాల్లో చేర రాజవంశం చాలా గొప్పది. సుమారు తొమ్మిది వందల సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశంలో అత్యంత బలంగా పాలించిన వంశం. వీరికి కేరళ పుత్రులన్న బిరుదు కూడా ఉన్నది. కేరళలోని మలబార్ తీరం నుంచి తమిళనాడు లోని కొంగు అంటే.. నేటి కోయంబత్తూర్ వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పశ్చిమ కనుమలు విస్తారంగా ఉండటం, సుగంధ ద్రవ్యాలు విస్తృతంగా పండటం అన్నది చేరరాజ్యానికి అంతర్జాతీయ వాణిజ్యానికి అనుకూలంగా ఒక పెద్ద వరంగా మారింది. ముఖ్యంగా మిరియాల ఎగుమతి ఆనాడు చాలా కీలకమైంది. దీనివల్ల చేర రాజులకు అపారమైన సంపద కూడా సమకూరింది. చోళులు, పాండ్యుల సమకాలంలో ఉండిన సామ్రాజ్యం చేర. అంతర్జాతీయ వాణిజ్యమే కాదు.. ఇవాళ కేరళలోని అద్భుతమైన సాంస్కృతిక నిర్మాణాలు అన్నీ కూడా చేర సామ్రాజ్యపు ఆనవాళ్లే.. కలప, మట్టి, ఏటవాలుగా ఉండే పైకప్పులతో కూడుకున్న ఆలయ నిర్మాణాలు మనకు కేరళలో అధికంగా కనిపిస్తాయి.
ఇవాళ మనం భారతదేశపు దక్షిణపు అంచున సముద్ర తీరంలో కనిపించే కన్యాకుమారి దేవాలయం అభివృద్ధి చేసింది చేర రాజులే. దీనిని వారు భగవతి అమ్మన్ దేవాలయంగా నిర్మించారు. దేశంలోని 52 శక్తి పీఠాలలో కన్యాకుమారి ఒకటి. దీనితోపాటు కొట్టుక్కల్ గుహాలయం, కొగంగళూర్ భగవతి ఆలయం, వడక్కునాథ ఆలయం, తిరువంచికులం మహాదేవ ఆలయం వంటివన్నీ కూడా చేర రాజులు నిర్మించినవే. భారతదేశంలో కలప వాస్తు శిల్పానికి ఈ ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. కన్యాకుమారి దేవాలయం మూడు సముద్రాలు కలిసే తీరంలో ఉన్నది. సముద్రపు ఉద్ధృతి, ఆటుపోట్లను తట్టుకొని ఆలయం నిర్మించడం అంటే సామానయం కాదు. కన్యాకుమారి తీరం ఇసుకతో కాకుండా గట్టి గ్రానైట్ బండరాళ్లతో కూడి ఉంటుంది. ఇసుక తక్కువగా ఉంటుంది. దీనితో ఈ గ్రానైట్ రాళ్లపైనే ఆలయం నిర్మించారు. సముద్రపు అలల తాకిడిని తట్టుకొనేందుకు వీలుగా భారీ ఎత్తున రాతి ప్రహరీని నిర్మించారు. మొదట పాండ్యులు, ఆ తరువాత చోళులు, చేర రాజులు దీనిని మరింత విస్తరించి, పునర్నిర్మాణాలు చేశారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో విశిష్టమైన స్వతంత్ర మహాకావ్యం శిలప్పదికారం రచనను చేర రాజైన చేరన్ సెంగట్టువన్ తమ్ముడు ఇలంగో అడిగళ్ రాశాడు. శిలప్పదికారం అంటే కాలి అందె యొక్క గాథ. ఈ కథలో కథానాయిక కన్నగికి కేరళలోనే కాదు భారతదేశంలోనే విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కన్నగి దంపతుల కథను ఈ రోజుకూ కేరళ, తమిళ ప్రజలు చెప్పుకుంటుంటారు. కన్నగి పేరుమీద సెంగట్టువన్ ఏకంగా దేవాలయాన్ని నిర్మించాడు.
ఆయన తరువాత స్థాను రవివర్మ (844-885) చేర సామ్రాజ్యాన్ని అధిష్ఠించారు. ఆయన సమయంలోనే క్రైస్తవం భారతదేశంలోకి ప్రవేశించింది. భారతదేశంలోకి క్రీస్తు శకం 52 లో సెయింట్ థామస్ వచ్చారన్నవాదనకు ఎలాంటి ఆధారాలైతే లేవు అని ముందే చెప్పుకున్నాం. క్రైస్తవులు భారత దేశంలో మొదట ప్రవేశించింది 9 వ శతాబ్దంలో మాత్రమే. ఇందుకు సంబంధించి మాత్రమే మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఆరో శతాబ్దంలో కాస్మస్ ఇండికాప్లెస్టస్ అనే యాత్రికుడు మలబార్లో క్రైస్తవులు ఉన్నారు అని పేర్కొన్నా.. అందుకు ఎలాంటి ఆధారాలు మనకు కనిపించవు. సెయింట్ థామస్‌కు సంబంధించి మనకు లభిస్తున్న ఒకే ఒక గ్రంథం ‘యాక్ట్ ఆఫ్ థామస్’ థామస్ ఉన్నప్పుడు ఆయన ఏం అద్భుతాలు చేశారు అన్న విషయాలను సిరియాక్ భాషలో రాశారు.
This best known of all poetic expressions of the Thomas Tradition goes so far as to give a demographic and social breakdown (varna¯shramadharma) of hereditary groups (castes). Based on lineage narratives (vamshva¯lis), this work provides a glimpse of the social make-up of the earliest Christian community in Malabar that, by tradition, the Apostle left behind: namely, 6,850 Brahmans, 2,800 Kshatriyas, 3,750 Vaishiyas, and 4,250 Shudras—the whole coming to more than 17,480 souls.13 Significantly, no mention is made of what ‘others’ (i.e. aboriginals or untouchables: Adiva¯sis and Dalits in today’s argot) might also have become part of this Christian community. Such groups, in terms of texts already outlining Brahmanical views of the social structure, would not have been worth counting. Such peoples, scarcely more than dust, could only be polluting seen—a perspective that hardly reXected values of the Gospel. But what were worth counting were manifold deeds that were seen as miraculous events—namely, healings and deliverances performed by the Apostle—94 souls delivered from death; 260 from devils; 230 from leprosy; 220 from paralysis; and 250 from blindness (christianity in india from biginings to the present.. robert eric frykenberg p.100)
ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే.. థామస్ ఉన్నట్టుగా చెప్తున్న కాలంలో క్రైస్తవ సమాజంలో కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించారని యాక్ట్ ఆఫ్ థామస్ పుస్తకంలో పేర్కొన్నట్టు ఫ్రైకెన్ బర్గ్ రాశారు. ఆ కాలంలో
- బ్రాహ్మణులు – 6,850
- క్షత్రియులు – 3,750
- వైశ్యులు – 3,750
- శూద్రులు – 4,250
మొత్తం= 17,480 మంది క్రైస్తవులు ఉన్నట్టుగా పేర్కొన్నారు. అంటే.. 2026 ఏప్రిల్‌లో క్రైస్తవంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన తరువాత మంద కృష్ణ మాదిగ అనే నాయకుడు బ్రాహ్మణ పాస్టర్లు.. దళిత క్రైస్తవులంటూ చేస్తున్న వాదనకు బీజం ఎక్కడున్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ జాబితాలో అంటరానివారు, దళితులు అన్న వివక్ష కనపడదు. వేల ఏండ్ల నాటి నుంచి ఈ దేశంలో కులాలు ఉన్నాయన్న వాదనా కరెక్టు కాదని ఈ జాబితా స్పష్టం చేస్తున్నది. క్రైస్తవంలోకి మారిన తరువాత కూడా వర్ణాలను ఎంచుకున్నారే తప్ప కులాలు అప్పటికి లేనే లేవు. ఇప్పుడు ఈ కుల వివక్ష ఎప్పటి నుంచి వచ్చిందో మేధావులనబడే వారు చెప్పాలి.
మధ్య ఆసియా ప్రాంతంలోని పర్షియా(ఇవాళ్టి ఇరాన్) మెసపటోమియా ప్రాంతాల్లో రెండో షాపూర్ రాజు కాలంలో, రోమన్లతో మత ఘర్షణలు, రాజకీయ అస్థిరతల నేపథ్యంలో జరిగిన యుద్ధాల సమయంలో సిరియన్ క్రైస్తవులపై ఊచకోతలు జరగటంతో భారతదేశానికి వలసలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని పలువురు రికార్డు చేశారు కూడా. ‘‘Christians in the Sassanian Empire faced intermittent persecution, especially under rulers like Shapur II’’.
(Moffett, 1998, pp. 137–140; Frykenberg, 2008, pp. 95–97; Pothen, pp. 25–27). మూడు రచనల్లో వేర్వేరుగా ప్రస్తావించిన అంశాల సారాంశం ఇది. అప్పటికే చేరా రాజులు అంతర్జాతీయ నౌకా వ్యాపారం చేస్తుండటంతో సముద్ర మార్గాలు అభివృద్ధి చెంది ఉన్నాయి. రుతుపవనాలను అనుసరించి అరబ్బు వ్యాపారులు కేరళ తీరానికి వచ్చేవారు. దీనితో వ్యాపారులతో పాటు వలస రావడానికి మార్గం సుగమమైంది. వీరు వచ్చిన తరువాతత స్థాను వర్మ వీరికి ఆశ్రయమిచ్చారు. ఇందుకు సంబంధించి ఇచ్చిన రాగి శాసనాలు మనకు లభిస్తున్నాయి. 849 లో థరిస్సపల్లి రాగి శాసనం ఇందులో అతి ముఖ్యమైంది. అంతకు ముందు క్రైస్తవుల రాకకు సంబంధించి కానీ, థామస్ రావడం గురించి కానీ మనకు ఆధారం లేదు. ఈ శాసనం లో కూడా థామస్ ప్రస్తావన ఉండదు. స్థాను వర్మ మారువన్ సపిర్ ఇసాకు థరిస్సపల్లి చర్చిని నిర్మించుకోవడానికి చేసిన భూదానం తాలూకు ఆదేశ పత్రమిది. క్రైస్తవ సమాజానికి ప్రత్యేక హక్కులు కల్పించడం, పన్నుల మినహాయింపు, స్వయంపాలన హక్కు, రాజాధికారుల ప్రత్యక్ష జోక్యం లేకుండా తమ వ్యవహారాలను నిర్వహించుకొనే స్వేచ్ఛను స్థాణు వర్మ కల్పించాడు. ఈ మత సమాజం ఆనాడు స్థానిక హిందూ సమాజం కంటే ఉన్నత సమాజంగా గుర్తింపును ఈ శాసనం కల్పించింది. దాదాపు 72 హక్కులను స్థాణు వర్మ సిరియాక్ క్రైస్తవులకు కల్పించాడు. ఈ శాసనం తమిళ, హిబ్రూ, అరబిక్, పహ్లవి భాషల్లో ఉంటుంది. ఈ సిరియాక్ క్రైస్తవులు తొలినాళ్లలో వారి భాషలో ఆరాధన పద్ధతులు పాటించేవారు. పర్షియన్ క్రైస్తవ సంప్రదాయాన్ని అనుసరించేవారు. సామాజికంగా మాత్రం స్థానిక కేరళ సంస్కృతిలో భాగంగా జీవించారు. ఫ్రైకెన్ బర్గ్ చెప్పినట్టు వారు సంస్కృతిలో భారతీయులుగా మత పరంగా క్రైస్తవులుగా జీవించారు. సిరియన్ క్రైస్తవులు తమ మత గురువును (ఇప్పుడు పాస్టర్) కట్టనార్ అని పిలిచేవారు. దుఖానా అనే పండుగను చేసుకొనేవారు. మలయాళం, సిరియాక్ భాషలను వీరు మాట్లాడేవారు. పెండ్లిళ్లు మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారమే చేసుకొనేవారు. మంగళసూత్రం కట్టడం ఉన్నప్పటికీ.. ఆ సూత్రాల స్థానంలో శిలువ గుర్తు ఉన్న బంగారు పతకాన్ని పెట్టేవారు. వరకట్నం ఆ సమాజంలోనూ ఉండేది. సిరియాక్ చర్చిలో కత్తనార్ సమక్షంలో వివాహం చేసేవారు. వేషధారణ కూడా నాయర్ కుటుంబాలను పోలినట్టు ఉండేది. 20 శతాబ్దంలో తిరునల్వేలిలో సేవలందించిన స్టీఫెన్ నీల్ కూడా వీరిని హిందూ క్రైస్తవులుగా పిలిచారు. క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్ల మధ్య వివాదాల వల్ల సిరియన్ క్రైస్తవ చరిత్ర సరిగా రికార్డు కాలేదని ఈయన పేర్కొన్నాడు.
మతమార్పిడుల విషయానికి వస్తే, ప్రారంభ దశలో (1వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు) పెద్ద ఎత్తున మార్పిడులు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, మార్పిడులు నెమ్మదిగా, సహజంగా జరిగాయి మరియు అవి ప్రధానంగా వాణిజ్య సంబంధాల ద్వారా లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా జరిగాయి. ఈ సమూహం సామాజికంగా కొంతవరకు మూసివున్న (exclusive) వర్గంగా ఉండటం వల్ల, తక్కువ కులాల ప్రజలలో విస్తృత స్థాయిలో మార్పిడులు జరగలేదు. కానీ, చేర రాజుల అతి ఔదార్యం, అతి మంచితనం, అతి నమ్మకం భారతదేశంలో క్రైస్తవం బలంగా వేళ్లూనుకోవడానికి కారణమైంది,. అది క్రమంగా భస్మాసుర హస్తంగా పరిణమించింది.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
