Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-26

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 27.

రాక్షసులు అంటే ఎవరు? దెయ్యాలు, భూతాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి బట్టలు కట్టుకుంటాయి. మనుషులతో ఎలాంటి సంబంధాలు ఎలా పెట్టుకుంటాయి? మీలో ఎవరికైనా తెలుసా..? మనం సినిమాల్లో, హిందీ సీరియళ్లలో ఇలాంటి క్యారెక్టర్లని చాలా చూస్తుంటాం. నల్లటి శరీరం, చీకటి రాజ్యానికి అధిపతి, చింపిరి జుట్టు.. జుట్టులోంచి మొలిచిన కొమ్ములు, ముడతలు పడిన చర్మం, నగ్నంగా వీరంగాలు వేయడం, పిచ్చి పిచ్చిగా అరవటాలు.. సగం జంతు రూపాలు, మేక గడ్డం.. ఇలా రకరకాల పోలికలతో ఈ పాత్రలను మనం చూస్తాం. ఈ పాత్రలు ఈ రకంగా ఉంటాయన్నది ఎక్కడి నుంచి మనవాళ్లు స్వీకరించారు? పురాణాల్లోనో, ఇతిహాసాల్లోనే మనం చూసే రాక్షసులు అందరూ కూడా సాధారణంగా జన్మించిన వారే. నరకాసురుడు భూదేవి కడుపున పుట్టినవాడే, రావణుడు పులస్త్యుడి మనవడే. హిరణ్య కశిపుడు జయ విజయుల్లో ఒకరు. బాణాసురుడు, బలి.. ఇలా అందరూ కూడా సాధారణంగా జన్మించిన వారే.. వీరికి భయంకరమైన కొమ్ములున్నాయని, మరొకటని, మరొకటని లక్షణాలు ఎక్కడా ఎవరూ చెప్పినట్టు కనిపించరు. కేవలం వారి వ్యక్తిత్వాలు, దుర్వ్యవహారాల కారణంగా వారు అసురులుగా సమాజానికి కీడు చేసేవారిగా మనం గుర్తించాం. వారి సంహారం లోక కల్యాణం కోసమని, ధర్మ రక్షణ కోసమని భావించాం. మరి మనకు అసలు సంబంధమే లేని ఈ అసుర వేష ధారణలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? బైబిల్ నుంచి.

బైబిల్ లోనే ఈ విధమైన వర్ణనలు మనకు కనిపిస్తాయి. బైబిల్ పాత నిబంధనలో ‘సాతాను’ అన్న మాటకు పెద్ద ప్రాధాన్యం లేదు. అప్పటికి క్రైస్తవం కూడా ప్రాకృతిక మతాల నుంచి వేరు కాలేదు. యూదు మతం మూలాల నుంచి అవతరించిన మతం కావడంతో.. ఏకేశ్వరోపాసనను కూడా క్రైస్తవం స్వీకరించింది. యెహోవాను దేవుడిగా పేర్కొన్నది. మంచి అయినా, చెడు అయినా అన్నింటికీ ఆయనదే బాధ్యతగా పేర్కొన్నది. పాత నిబంధన తరువాత క్రైస్తవంలో వచ్చిన పుస్తకాలలో ‘మొదటి దిన వృత్తాంతములు’ (first chronicles or 1 chronicles) అన్న పుస్తకంలో సాతానుకు ఒక స్పెషల్ స్టేటస్‌ను కల్పించారు. దేవుడికి శత్రువుగా, చెడుకు ప్రతీకగా ఇతడిని నిర్వచించారు. తరువాతి కాలంలో బైబిల్ కొత్త నిబంధన వచ్చేసరికి ఈ సాతాను మరింత శక్తిమంతుడయ్యాడు. ప్రముఖుడు అయ్యాడు. ‘సాతానును దెయ్యముల అధిపతియైన బీల్జ్ బబ్’ అని పిలిచారు. (మత్తయి 12:24), ‘మనము పోరాడునది శరీరులతో కాదు గాని, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో’ అని సాతాను గురించి ఎఫెసియులకు 6:12 లో పేర్కొన్నారు. చీకటిని సాతాను రాజ్యంగా కొత్త నిబంధన వర్ణించింది. క్రీస్తు సువార్తను నమ్మకుండా చేయడమే అతని పని అని చెప్తుంది. పీటర్ సువార్త 5:8లో ‘మీ విరోధియైన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు’ అని చెప్తారు. ఇక్కడ సాతాను దేవుడి ప్రణాళికను అడ్డుకొనే శక్తిగా చెప్తారు. క్రీస్తు రెండవసారి వచ్చేదాకా దేవుడికి, సాతానుకు మధ్యన ఘర్షణ కొనసాగుతూనే ఉంటుందని అభివర్ణిస్తారు. క్రైస్తవ మతానికి ప్రధాన శత్రువుగా సాతానును కొత్త నిబంధన క్రియేట్ చేసింది. క్రీస్తు రాజ్యానికి, సాతాను రాజ్యానికి మధ్యన తీవ్రమైన ఘర్షణ కొత్త నిబంధనలో మాత్రమే మనకు కనిపిస్తుంది. సాతాను నుంచి దయ్యం అవతరించింది. పాత నిబంధన నాటికి ఈ శక్తులకు ఎలాంటి ప్రామాణిక చిత్రమంటూ లేనే లేదు. కొత్త నిబంధన వచ్చిన తరువాత సాతానుకు, దెయ్యానికి రూపాలు ఏర్పడ్డాయి. క్రైస్తవ సంస్కృతిలో నలుపు రంగు చెడు (sin) కు, లేదా పాపానికి గుర్తుగా భావిస్తూ వచ్చారు. క్రైస్తవానికి ముందు రోమన్, సెల్టిక్ సంస్కృతులలో కొమ్ములు ఉన్న పాన్, సెర్నున్నస్ వంటి దేవతలను కొలిచేవారు. కానీ, క్రైస్తవ సంస్కృతి వచ్చిన తరువాత ఆ కొమ్ములు ఉన్న ఆకారాలను దెయ్యాలుగా చర్చి మార్చివేసింది. అదే సమయంలో తెలుపును శాంతికి, పవిత్రతకు చిహ్నంగా నిర్వచించారు. ఎరుపు రంగును కోపానికి గుర్తుగా, యాక్సిడెంట్‌కు ప్రతీకగా వాడటం మొదలుపెట్టారు. 17వ శతాబ్దం వచ్చేసరికి డయానా దేవత అవతరించింది. అన్యమతాలలో ఉన్న దేవతల రూపాలను రాక్షస రూపాలుగా, దయ్యాలకు ప్రతీకలుగా ఒక ప్రణాళిక ప్రకారం చర్చి నిర్వచించుకుంటూ వచ్చింది. విచిత్రం ఏమిటంటే, భారతీయ సంస్కృతిలోనూ ఇప్పుడు ఇవి ఎవరికీ తెలియకుండానే కలగలిసిపోయాయి.

వాస్తవానికి మనకు నలుపు అపవిత్రం కాదు. నలుపు చెడుకు, పాపానికి సంకేతం కానే కాదు. నలుపు రంగు అనేది రక్షణకు, అనంతత్వానికి, అజ్ఞానాంధకారాన్ని చీల్చుకుంటూ వచ్చే జ్ఞానానికి ప్రతీకగా భారతదేశం భావిస్తుంది. మంగళసూత్రంలో నల్లపూసల హారానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. నలుపు రంగు దుస్తులు ధరించడం అన్నది నెగెటివ్ శక్తుల నుంచి రక్షణ కల్పించేదిగా భావిస్తారు. దృష్టి దోషాన్ని నివారించడం కోసం నలుపు రంగుతోనే దిష్టి చుక్క పెడతారు. ఎందుకంటే.. నెగెటివ్ వైబ్రేషన్స్ ఏవైనా ఉంటే వాటిని ఈ నలుపు రంగు పీల్చేసుకుంటుంది. మన దగ్గర అంజనం వేయడం అనే సంప్రదాయం కూడా ఉన్నది. నల్లని పదార్థాన్ని వినియోగించి మనో నేత్రంతో వివిధ విషయాలను చూసేందుకు ప్రయత్నించే వ్యక్తులు ఉంటారు. ఇక భారతీయమైన యోగ తంత్ర శాస్త్రాలను అధ్యయనం చేస్తే.. మనం సాధన చేస్తున్నప్పుడు విడుదలయ్యే ప్రాణశక్తి బయటకు పోకుండా ఉండటానికి, అదే విధంగా బయటి ప్రతికూల ప్రభావాలు మనపై పడకుండా ఉండటానికి నలుపు దుస్తులు ధరిస్తారు. ఇంతెందుకు అయ్యప్ప మాలధారులు నలుపు దుస్తులు ధరించడం వెనుక కూడా ఈ బయటి శక్తులకు ఆకర్షితులు కాకుండా.. అంతర్ముఖంగా ఉండాలన్నది లక్ష్యంగా ఉంటుంది. దశ మహావిద్యల్లో తొలి విద్య మహాకాళి. భారతీయ సంప్రదాయంలో కాళి నలుపును ప్రతిఫలింపజేస్తుంది. నలుపు అంటే అల్టిమేట్ డార్క్ ఎనర్జీ.. బ్లాక్‌హోల్ లోని ద్రవ్యరాశి ఒక నియమిత పరిమితి దాటగానే మహా విస్ఫోటనం జరుగుతుంది. మనకు అంతుపట్టనిదంతా నలుపుగానో, నీలంగానో కనిపిస్తుంది. అంటే, మన కంటికి కనిపించనంత దూరంగా ఉన్నచోట కనిపించే రంగు నలుపు లేదా నీలం. ఉదాహరణకు ఆకాశం, సముద్రం, నక్షత్ర మండలం ఇవన్నీ కూడా మనకు అంతుపట్టని రహస్యాలే. వీటిలో అత్యంత రహస్యమైన శక్తులు దాగిఉన్నాయన్నది వాస్తవం. ఇది అనంతత్వానికి (eternal) సంకేతం. కర్మఫలానికి అధిపతిగా భావించే శని దేవుడిని కూడా మనం నలుపు రంగులోనే ఆరాధిస్తాం. ఫిజిక్స్ ప్రకారం చూసుకున్నా.. అన్ని రంగులనూ తనలో సంలీనం చేసుకొనే శక్తి నలుపు రంగుకే ఉన్నది. అన్నింటినీ తనలో కలుపుకొనే ఈశ్వర తత్వానికి ప్రతిరూపంగా నలుపును మనం భావిస్తాం. రామ కృష్ణులను కూడా మనం నలుపు, లేదా నీల మేఘ శ్యాములుగా ఎందుకు భావిస్తామంటే కారణం వారు అనంతత్వానికి, ఈశ్వర తత్త్వానికి ప్రతీకలు కావడం వల్లనే.

ఇక ఎరుపు రంగు విషయానికి వస్తే, భారతీయ సంప్రదాయంలో ఎరుపు చాలా పవిత్రమైనది. సిందూరం సౌభాగ్యానికి చిహ్నం, పూజా కార్యక్రమాల్లో అక్షింతలు, కలశ పూజకు కుంకుమ వాడటం అందరికీ తెలిసిందే. ఉత్తర భారతదేశంలో పెండ్లి కూతురు ఎరుపు చీరను ధరించడం సంప్రదాయం. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు కావలసిన చైతన్యానికి, సంతానోత్పత్తికి ఇది గుర్తు. ఇక రక్తం జీవనాధారానికి గుర్తు. ఇది ప్రాణశక్తికి సంకేతం. మనిషిలోని చైతన్యానికి, పోరాట పటిమకు గుర్తు. జీవుడు అవతరించే మూలాధార చక్రానికి గుర్తు కూడా ఎరుపే. భూమితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కూడా ఎరుపు సూచిస్తుంది. ఎరుపు క్రియాశీలతకు గుర్తు.

భారతీయ సంప్రదాయంలో నలుపు అనంతత్వం నుంచి ప్రారంభమైన ప్రయాణాన్ని సూచిస్తే.. ఎరుపు ఆ ప్రయాణంలోని క్రియాశీలతకు సంకేతం. అంతిమంగా కలిగే శాంతికి గుర్తు తెలుసు. ఇంకో మాటలో చెప్పాలంటే.. సౌరమండలంలోని మధ్యన కాళి ఉంటుంది. గర్భంలో ఉమ్మనీరు మధ్యలో శిశువు ఉంటాడు. ఈ శూన్యంలో ఉన్న శిశువులో తన ప్రసారం ద్వారా రక్తం చైతన్యాన్ని రగిలిస్తుంది. చివరగా బయటకు వచ్చిన శిశువు ఆనందంతో పెట్టే కేరింత తెలుపుకు సంకేతం. సృష్టి పరిణామ క్రమంలో ఈ మూడు రంగులకు ఉన్న ప్రాధాన్యం అది.

ఈ మూడు రంగుల్లో క్రైస్తవం తెలుపును సొంతం చేసుకుంది. మిగతా రెండు రంగులకు తాము ఫాగన్‌లుగా ముద్రవేసిన ఇతర మతాల్లో ప్రాధాన్యం అధికంగా ఉండటంతో వాటిని పాపపు చిహ్నాలుగా, దయ్యాలకు గుర్తుగా, భయానక బీభత్సాలకు గుర్తులుగా నిర్వచనాలు తయారు చేసింది.

Throughout the Middle Ages the Devil was usually referred to as Satan, a name meaning ‘the adversary’ which appears in the Bible. In the Old Testament Satan did not figure very prominently. Judaism, being a monotheistic religion, originally attributed all creation and the operation of the universe to the one true God, Yahweh. All reality, evil as well as all good, was His responsibility. Only in one of the later books of the Old Testament, the first book of Chronicles, did Satan assume a distinct personality and present himself as the enemy of God and as the embodiment of evil. In the New Testament Satan became much more prominent. Presiding over a host of subordinate demons, he not only tempted Christ himself in the desert but also became the powerful opponent of Christianity itself, enticing people to withdraw from Christ and to reject His teaching.3 A titanic struggle thus arose between the Kingdom of Christ on the one hand and the Kingdom of Satan on the other, a conflict that most believed would continue until the Second Coming. As Christianity, the Kingdom of Christ, spread throughout the East and the West, it was only natural that the Church fathers would consign the religions with which they were competing, both Jewish and pagan, to the Kingdom of Satan. This process actually contributed to the visual depiction of the Devil in Christian art. One of the most effective tactics of the Christian Church in dealing with converts or potential converts who continued to worship their pagan gods was to demonize those gods – to claim that those deities were actually demons or the Devil himself. Because this equation was made so frequently, Christians began depicting the Devil in the ways that pagans viewed their gods. There was no standard image of the Devil in medieval art, and some of the features that he acquired in these depictions owe more to Christian theology than to pagan imitation. His depiction as black, for example, comes from the traditional association of black with sin rather than from the blackness of any particular pagan god. Likewise, the wings derive from the Devil’s status as a fallen angel, not from the fact that many pagan gods were themselves winged creatures. Nevertheless, many of the features commonly given to the Devil were originally those of pagan gods. The goatee, the cloven feet, the horns, the wrinkled skin, the nakedness and the semi-animal form bear direct reference to both the Greek and Roman god Pan and to the Celtic god Cernunnos, while the female breasts, which appear often in seventeenth-century English depictions of the Devil, came almost certainly from the goddess Diana. …… It is only natural that in describing the appearance of this ‘god’ he would allude to the features most commonly assigned to the Devil, which in turn derived in large part from earlier images of pagan fertility gods. Although Satan was the most commonly used name to refer to the Devil, it did have some competition. Occasionally the name of Lucifer, which the patristic writers assigned to the great archangel who rebelled against God and was cast down from heaven into hell, was used to describe the Devil. The name, a Roman word for the morning star, does not appear in the Bible, but some of the patristic writers identified it with the star in Isaiah that tried to be like God and which God cast out of the heavens. Lucifer, therefore, became a name that could be used to describe Satan before the fall. (the-witch-hunt-in-early-modern-europe, p.32, 33).

క్రైస్తవ చర్చి సాతానును సృష్టించిన తీరు, ప్రపంచంలో అనేక మంది రాక్షసులను సృష్టించింది. మనకు తెలిసినంత వరకు మానవాళికి, మంచివాళ్లకు ద్రోహం చేసేవారిని మాత్రమే రాక్షసులుగా భావిస్తాం. కానీ, తమ మతాన్ని విద్వేషించే ప్రతి వ్యక్తీ, శక్తీ కూడా రాక్షసులుగా క్రైస్తవం నిర్ణయించింది. మనకు మోహన్ లాల్ లూసీఫర్ సినిమా తెలుసు. కానీ, లూసీఫర్ అంటే, చీకటికి యువరాజు (ప్రిన్సెస్ ఆఫ్ గాడ్).. గాడ్ ఫాదర్ అన్నమాట. లూసీఫర్‌లో హీరో గాడ్ ఫాదర్ లాగా కనిపించే మంచి మనిషిగా కనిపిస్తాడు. నిజానికి ఈ లూసీఫర్ అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. ఒక ప్రణాళిక ప్రకారం క్రైస్తవేతర మతాలలోని రూపాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు సాతానుతో లింక్ పెట్టడంలో మిషనరీలు సక్సెస్ సాధించాయి. ఈ లూసీఫర్ దెయ్యాలకు యువరాజు లాంటివాడన్నమాట.. ఇలాంటి పేర్లతో వేలు లక్షల సంఖ్యలో రాక్షసులు, దయ్యాలు ఉన్నాయని.. ఇవన్నీ సాతానుకు సైన్యం లాగా పనిచేస్తాయని క్రైస్తవులు నమ్మడం ప్రారంభించారు.

విడ్డూరం ఏమిటంటే.. ఈ రాక్షసుల వ్యవహారాన్ని అనగా.. ఈ రాక్షసులు ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తుంటారు అన్న విషయాలను పరిశోధించడానికి శాస్త్రవేత్తలు కూడా తయారయ్యారు. వీరికి రాక్షస శాస్త్రవేత్తలు (demonologists) అని పేరు పెట్టి చర్చి వారిని సమున్నతంగా గౌరవాన్ని ఇచ్చింది. 15 వ శతాబ్దంలో స్పానిష్‌కు చెందిన అల్పోన్సో డీస్పినా అనే ఆయన ప్రపంచంలో 13,33,06,668 మంది రాక్షసులు ఉన్నట్టుగా కచ్చితంగా బాటా రేటు చెప్పినట్టు లెక్క గట్టి చెప్పారు. వీరిని ఆయన ఎక్కడ ఎలా చూశారో తెలియదు. ఈయన తరువాత సిగ్మండ్ ఫెయ్ రాబెండ్ సంకలనం చేసిన ఒక పుస్తకంలో ఈ రాక్షసుల సంఖ్యను 26 బిలియన్లు అన్నాడు. అంటే.. 26 వందల కోట్లు అన్నమాట. మరికొందరు సోకాల్డ్ డెమొనాలజిస్టులు ఈ రాక్షసుల సంఖ్యను ఆరేడు మిలియన్లకు పరిమితం చేశారు. ఈ రాక్షసులలో హైరార్కీ కూడా ఉంటుందట. వీరిలో ఉన్నతస్థాయి రాక్షసులకు పేర్లు ఉండేవిట. కొన్ని నిర్దిష్టమైన పాపాలపై మాత్రం వీరికే అధికారాలు ఉండేవి.

In addition to the Devil, referred to as either Satan, Lucifer or some other title like the Prince of Darkness, the Prince of this World or simply the demon, medieval and early modern Christians believed that there were large numbers of devils, demons or fiends who assisted the Devil in his work of evil, temptation and destruction. The New Testament indicates that these demons were legion, but it does not give a precise figure, so their exact numerical strength became a topic of speculation among demonologists. The fifteenth century Spanish theologian Alfonso de Spina came up with a tally of 133,306,668, which was exceeded only by the much less precise calculation of 26 billion in one of the devil books compiled by Sigmund Feyerabend in 1569? Other estimates were usually much more conservative, in the range of six or seven million. Since these demons were believed to be fallen angels, they were often ranked, like the angels, hierarchically. Some demons, especially those of the higher orders, were referred to by name, possessed distinct personalities and presided over certain sins. On such matters there was nothing even approaching a consensus, and the entire matter could become hopelessly confused when demonologists referred to the Devil (i.e., Satan) by the names of one of the chief demons, such as Beelzebub, Leviathan, Asmodeus, Belial or Behemoth, or demoted either Satan or Lucifer (or both) to a status of mere parity with his subordinates. This confusion is not surprising, since the source of these names was either the Bible or the apocryphal books of the pre-Christian period, in which the various names were used interchangeably. The confusion appears not only in the work of demonologists but in the reports of witches’ sabbaths, where it frequently cannot be determined whether the Lord of the ceremony, who was often depicted as a horned animal, was supposed to be the Devil or one of his chief demons. (the-witch-hunt-in-early-modern-europe, p.34).

ఈ నిర్వచనాలు, ఈ రకమైన సాతాను పేర్లు, ఆచారాలను విపరీతంగా ప్రజల్లోకి తీసుకొని రావడం వల్ల క్రైస్తవానికి అన్యమతాలలో ఉన్నవారిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోయడానికి దారి ఏర్పడింది. ఫలితం మూడు వందల సంవత్సరాల పాటు.. యథేచ్ఛగా సాగిన 2 లక్షల మంది మారణ కాండ.

(ఇంకా ఉంది)

Exit mobile version