[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 31.
తిరుమల దేవాలయానికి సుమారు 800 ఏండ్ల క్రితం ఎంత ఆదాయం ఉండేది? అంచనా వేయగలమా? 1540లలో తిరుమల వార్షిక ఆదాయం అక్షరాలా రూ.2 లక్షలు. ఇప్పుడు ఎంత అయ్యేదో ఆలోచించండి. ఈ వ్యాస పరంపరలో తిరుమల ప్రస్తావన దేనికన్న సందేహం రావచ్చు. కానీ, ఈ విషయం చాలా చాలా ముఖ్యమైనది. భారతదేశంలోకి ముస్లింలు ఉత్తరం వైపు చొచ్చుకొచ్చిన తరువాత ముల్తాన్ నుంచి సోమ్‌నాథ్, మధుర, కాశీ, అయోధ్య వంటి అన్ని దేవాలయాలను కొల్లగొట్టారు. ముస్లింల తరువాత యూరోపియన్లు పశ్చిమ తీరంలో కేరళ మలబార్లో అడుగు పెట్టిన తరువాత మొట్టమొదట కొల్లగొట్టాలని చూసిన దేవాలయం తిరుమల. చరిత్రలో ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. చరిత్రకారులు తెలిసి చేశారో.. తెలియక ఇగ్నోర్ చేశారో తెలియదు. ఎక్కడైనా ఏదో మూల రికార్డు అయిందేమో నాకైతే తెలియదు. ప్రస్తుతం ఈ ఘటన గురించిన సమాచారమే ఎక్కడా లేకుండా కనుమరుగైంది. గాస్పర్ కొరియా అనే చరిత్రకారుడు lendas da india అనే గ్రంథం రాయకపోయి ఉంటే.. ఆనాటి తిరుమల వైభవం మనకు తెలిసేది కాదేమో.
వాస్కోడిగామా చనిపోయిన తరువాత పోర్చుగల్ భారతదేశంపై మతపరమైన అణచివేతను తీవ్రతరం చేసింది. పోర్చుగల్ రాజు మూడో జాన్ క్రైస్తవ మతోన్మాది అని చెప్పవచ్చు. భారతదేశంలో అత్యంత పవిత్ర క్షేత్రమైన గోమంతకం (ప్రస్తుత గోవా) లో నరమేధానికి అధికారికంగా అనుమతి ఇచ్చిన క్రూరుడు. ఈ రాజుగారికో బాల్య మిత్రుడు ఉన్నాడు. ఇతని పేరు మార్టిమ్ అఫోనసో డిసౌజా. జాన్ రాజ్యంలో డిసౌజాకు సర్వాధికారాలు సంక్రమించాయి. ముందుగా పక్కనే ఉన్న బ్రెజిల్‌కు వెళ్లి అక్కడి స్థానిక పౌరులపై క్రూరంగా అణచివేత చర్యలకు పాల్పడ్డాడు. వారిని బలవంతంగా క్రైస్తవంలోకి మార్చేశాడు. బ్రెజిల్లో దొరికే చక్కెర, బంగారం, వెండిని దోచుకొని లిస్బన్ కు తెచ్చి తన మిత్రుడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ క్రమంలోనే భారతదేశంలోని అపార సంపద, సుగంధ ద్రవ్యాల వ్యాపారం, ముస్లింల వ్యాపార కార్యకలాపాలపై వాస్కోడిగామా ద్వారా పూర్తి అవగాహన వచ్చింది. పోర్చుగల రాజు తన మిత్రుడైన డిసౌజాను భారత్‌కు పంపించాడు. డిసౌజా ఇక్కడికి వచ్చి సాధించింది చాలా తక్కువే. కానీ చేసిన విధ్వంసం చాలా ఎక్కువ. 1534-35 ప్రాంతాల్లో గుజరాత్ తీర ప్రాంతాల్లో తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా పై డిసౌజా తీవ్రంగా రాజకీయ ఒత్తిడి తీసుకొని వచ్చి డయ్యూను స్వాధీనం చేసుకున్నారు. అరేబియా సముద్రంలో వాణిజ్యానికి కీలక కేంద్రంగా డయ్యు ఉంది. గుజరాత్ నుంచి ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ మీదుగా వ్యాపార లావాదేవీలు డయ్యు తీరం నుంచి జరిగేవి. ఇంత కీలకమైన స్థావరాన్ని డిసౌజా స్వాధీనం చేసుకున్నాడు. దీంతో దమన్, వసాయ్ లపై కూడా పోర్చుగీసులకు పూర్తిగా అధికారం చేజిక్కింది. డయ్యులో డిసౌజా సముద్ర తీరాన్ని ఆనుకొని పెద్ద కోటను, సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. 1542లో పోర్చుగీసుకు భారతదేశ గవర్నర్‌గా మార్టిమ్ డిసౌజా బాధ్యతలు తీసుకున్నాడు. అదే సంవత్సరంలోనే కరడుగట్టిన మతోన్మాద మిషనరీ ఫ్రాన్సిస్ జేవియర్ కూడా భారతదేశానికి వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి మిషనరీల విస్తరణ, బలవంతపు మతమార్పిడులకు దారులు పరుచుకుంటూ పోయారు. ‘Oriente Conquistado a Jesu Christo Pelos Padres da Companhia de Jesus (Francisco de Sousa)’ గ్రంథంలో క్రీస్తు కోసం గోవా గవర్నర్ జయించిన తూర్పు దేశాల గురించి ప్రశంసిస్తూ పేర్కొన్నాడు. హిందూ దేవాలయాలను పగోడ్లు (pagodes) అని పిలిచేవారు. హిందువులను జెంటియోస్ (Gentios) అని, విగ్రహాలను ఐడొలోస్ (Idolos), విగ్రహారాధనను ఐడొలట్రియాస్ (Idolatrias) అని పిలిచేవారు. పోర్చుగల్ అధికారులకు, మిషనరీలకు రాసిన అనేక పత్రాలలో వీటి గురించిన ప్రస్తావన ఉండేది. విగ్రహారాధన పాపంగా, దేవాలయాల నిర్మూలన ‘ధర్మ సేవ’గా భావించేవారు. హిందూ ఆచారాలపై ఆంక్షలు విధించడం, బలవంతంగా మత మార్పిడి చేయించడం మామూలు కార్యమైంది.
“..e em seus pagodes e casas de seus idolos mandaua meter os cauallos..” “..matar as vaqas que elles adorauao..” (Lendas da India, Gaspar Correa) ఇది పోర్చుగీసు భాష. అంటే, వాళ్ల దేవాలయాలలో గుర్రాలను నిలిపించండి. వారు పూజించే ఆవులను చంపేయండి అని అర్థం.
ఇలాంటి డిసౌజాకు తిరుమల దేవాలయం గురించి తెలిస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయం తిరుమల అని డిసౌజాకు తెలిసేసరికి ఆశ్చర్యపోయాడు. ఈ ఆలయం గురించిన వివరాలు ముందుగా తెప్పించుకున్నాడు. ఇతను తెప్పించుకున్న వివరాల ప్రకారం తిరుమల విజయ నగర రాజుల ఆధీనంలో ఉన్నది. ఈ ఆలయానికి వార్షిక ఆదాయమే రెండు లక్షల వరకు వస్తున్నది. విజయనగర రాజులతో పాటు, వేల మంది భక్తులు ఈ ఆలయానికి కానుకల రూపంలో సంపదను సమకూరుస్తున్నారు. ‘‘The nobles decided that he should immediately be proclaimed king, and this was done with great celebrations and all the customary ceremonies. By the advice of all, and at the request of the elder brother himself—who excused himself from becoming king because he suffered from an illness that at times deprived him of his normal judgment—the younger brother, who was about a year younger, prudent, and a brave warrior, was raised to the throne as king. As soon as he became king, they gave him a large amount of money, and he raised a great army. All these affairs were directed by that great lord, whom the king appointed as regent of the entire kingdom, because he was considered a man of great wisdom and ability. Then, accompanied by a large force, he went to the Temple of Tremelle, which was the principal shrine and the richest establishment in the whole kingdom of Bisnaga. It stood in the region of the port of Pulicat.
The new king requested assistance from the temple in order to go and take possession of his kingdom and destroy the tyrant who had usurped it. The temple gave him one hundred oxen loaded with gold coins. With this wealth he immediately paid his troops and distributed generous rewards. In this way he assembled an army of sixty thousand horsemen and more than one and a half million infantry. He then marched toward Bisnaga, toward the city where the tyrant king was residing. Along the way many great nobles and lords joined him with their followers and acknowledged him as the rightful king of Bisnaga. News of this spread throughout the land. As a result, many nobles who had previously supported the tyrant abandoned him and went over to the side of the new king. The tyrant fell into despair. He gathered together his greatest treasures and his most beautiful women in a building. He ordered his servants to fill the lower parts of the structure with oil, butter, and other highly combustible materials. He also had the entrances sealed with stone and lime. He wished to set fire even to his treasury of jewels, but his followers would not allow it. Then he withdrew into the building and personally set fire to the materials underneath it. The structure exploded and was completely consumed by flames because of the quantity of combustible substances within it. ..” (Lendas da India, Gaspar Correa, p.283, 284)
ఇది ఒరిజినల్‌గా పోర్చుగీసు భాషలో ఉన్న సమాచారం. దీన్ని ఇంగ్లిష్ లోకి అనువదించడం జరిగింది. ఆనాడే తిరుమల దేవాలయం రాజ్యానికి సంపదను సమకూర్చింది. విజయనగర రాజులను పోర్చుగీసు వారు బిస్నగ అని పిలిచారు. ఈ ఆలయం పులికాట్ (పోర్చుగీసు వారు పిలిచింది Paleacate) సరస్సుకు దగ్గరలో సుమారు 2500 వేల అడుగుల ఎత్తైన కొండమీద ఉన్నది. విజయనగరంలో కొత్తగా అభిషక్తుడైన రాజు (ఈ ఘటన బహుశా అళియ రామరాయల కాలంలో జరిగింది. ఎందుకంటే గాస్పర్ కొరియా తేదీలు, పేర్లు, సంబంధాలను కలగలిసి రాశారు.) కు వంద ఎడ్ల బండ్లపై బంగారు నాణాలను తిరుమల వెంకటేశ్వర స్వామి పంపించాడంట. ఆ సంపదతో విజయనగర రాజు అరవై వేల అశ్విక దళాన్ని, పదిహేను లక్షల కాల్బలాన్ని సమకూర్చుకున్నాడు. అంతే కాదు. ప్రతి ఆగస్టు నెలలో అంటే ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం అనే పేరుతో పండుగ లేదా జాతర జరుగుతుందని గాస్పర్ కొరియా తన గ్రంథంలో పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో విజయనగర రాజులతో పాటు, వేల భక్తులు పాల్గొంటారని కూడా అతను తన గ్రంథంలో ప్రస్తావించాడు. పెద్ద ఎత్తున వర్తకులు, వ్యాపారులు పాల్గొనే పెద్ద మేళా అని ఈ బ్రహ్మోత్సవాలను నిర్వచించాడు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమల క్షేత్రంలో నడయాడిన కాలం సరిగ్గా ఇదే. 32 వేల సంకీర్తనలతో స్వామివారిని అర్చించుకొన్న అన్నమయ్య 1503 ఫిబ్రవరి 23 న పరమపదించారు. బ్రహ్మోత్సవాలను తిరుమలలో ప్రారంభించింది అన్నమాచార్యుల వారే. తరువాత సరిగ్గా నలభై సంవత్సరాలకు తిరుమల దోపిడీకి పోర్చుగీసు గవర్నర్ డిసౌజా కుట్ర పన్నాడు. తిరుమల ఆలయంలో అపారమైన బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాలు ఉన్నాయని డిసౌజాకు సమాచారం లభించింది. తిరుమల సంపదను దోచుకుంటే పోర్చుగల్ దేశం ఆనాటి కాలమానం ప్రకారం ఒక శతాబ్దం పాటు సమృద్ధిగా బతకగలుగుతుంది. అంతే ఈ ఒక్క ఆలయాన్ని దోచుకుంటే చాలు అన్న నిర్ణయానికి డిసౌజా వచ్చేశాడు. వెంటనే తన మిత్రుడైన పోర్చుగల్ రాజు జాన్‌కు వివరాలు పంపించాడు. అక్కడి నుంచి అనుమతిని పొందాడు. పోర్చుగీసు సైనికాధికారులు ఆ సంపదను దోచుకోవాలని డిసౌజాకు సూచించారు. ఆ తరువాత సైనిక చర్యకు సన్నాహాలు ప్రారంభించారు. నౌకలను సిద్ధం చేశారు. వాటికి భారీ ఎత్తున ఫిరంగులను అమర్చారు. సైనికులను సమీకరించారు. కొండపైకి ఎక్కడానికి గుర్రాలు, ఆయుధాలను రెడీచేశారు. ఈ సైనిక చర్యలో ఏయే అధికారులు వెళ్లాలో కూడా నిర్ణయాలు చేసేసుకున్నారు. విచిత్రమేమిటంటే.. తిరుమలమీద సైనిక దాడికి బయలుదేరడానికి ముందే.. దోచుకోబోయే సొమ్ములో ఎవరి వాటా ఎంతో పంచాయతీ మొదలైంది. గవర్నర్‌కు ఎంత, కెప్టెన్లకు ఎంత? సైనికులకు ఎంత? వారితో వచ్చే సామాన్య ప్రజలకు ఎంత? అన్న వాటాలపై పెద్ద ఎత్తున పంచాయతీ జరిగింది. అందరూ సమానంగా కావాలంటే కావాలని గొడవ పెట్టుకున్నారు. ఈ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ గాలివాన కాస్తా అటూ ఇటూ కొట్టుకుంటూ పోయి విజయనగరంలో కురిసింది. పోర్చుగల్ గవర్నర్ డిసౌజా తన సైనిక బలగాన్ని వెంటేసుకొని తిరుమల దేవాలయాన్ని దోచుకోవడానికి వస్తున్నట్టు విశ్వసనీయంగా సమాచారం అందింది. సామాన్య ప్రజలకు కూడా ఈ విషయం చేరింది.
After departing from Cochin, the Governor sailed along the coast to Cape Comorin. Having rounded the cape, he continued along the coast to Ceadala, a place near the shoals of Chilao. There he took local pilots on board and crossed the shoals, arriving at the Island of Cows (Ilha das Vacas), where more than twenty vessels had already assembled with him. He remained there for several days awaiting a catur (small vessel) that he had sent to Pulicat, in order to obtain information. When it returned, the messengers reported that the river of Pulicat did not have sufficient water for a vessel to enter except at high tides. They also brought letters from the captain and other men there. These letters strongly advised him not to proceed there, since he would have to travel overland to the Temple of Tremelle, as they understood he intended to do.
They reported that throughout the country it was already being said that he was coming to plunder the temple. The entire region had become agitated. The news had already reached Bisnaga (Vijayanagara). Because of this, a great number of people had assembled at the temple, prepared to defend it. They warned him that even if he went with two or three thousand men, not one of them would escape. Even if they were fully armoured and accompanied by ten thousand arquebusiers (musketeers), they would still be overwhelmed by the immense multitude of people gathered throughout the land. The population was so numerous, they said, that: “With handfuls of earth they could bury all of you.” Therefore they advised him to abandon the expedition. For if he went there and returned without accomplishing anything – as they believed would certainly happen – it would greatly damage his reputation and honour. All these warnings were sent to him through trusted messages. As a result, the Governor abandoned this course of action. He remained quietly for some time at the Island of Cows. ..”(Lendas da India, Gaspar Correa, p.325)
పోర్చుగీసు గవర్నర్ యాదృచ్ఛికంగా తిరుమలకు రావడం లేదు.. ఆలయాన్ని దోచుకోవడానికి వస్తున్నాడన్న వార్త విజయనగర రాజ్యం అంతటా వ్యాపించడంతో తిరుమల శ్రీవారి ఆలయ రక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఆలయానికి చేరుకున్నారు. స్థానిక నాయకులు తమ బలగాలతో మోహరించారు. ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు తిరుమలకు వచ్చేశారు. విజయ నగర సైనికులు మోహరించారు. తిరుమల చుట్టుపక్కన ఉన్న అనేక గ్రామాల ప్రజలు కూడా ఆలయ రక్షణకు తమ వంతుగా వచ్చి చేరుకున్నారు. గాస్పర్ కొరియా ఈ సన్నివేశాన్ని అద్భుతంగా వర్ణించారు. “no pagode estava muita gente prestes pera lho defender, “se la fosse com dous, nem tres mil homens, nom escaparia pe d’elles” అని పేర్కొన్నాడు. డిసౌజా రెండు మూడు వేల మంది సైన్యాన్ని వెంటేసుకొని పోయినా వారిలో ఏ ఒక్కరు కూడా బతికి బట్ట కట్టరని స్పష్టంగా చెప్పాడు. అంతే కాదు. అక్కడ సమీకరణ అయిన జన సమూహం తమ రెండు చేతులతో మట్టి ఎత్తి పోర్చుగీసు సైన్యం మీద పోస్తే.. మొత్తం సైన్యం ఆ మట్టి కింద సమాధి అయిపోతారని గాస్పర్ కొరియా స్పష్టంగా చెప్పాడు. దీంతో గవర్నర్ డిసౌజా, తిరుమలను దోచుకోవాలన్న కోరికను బలవంతంగా అణచి వేసుకోవాల్సి వచ్చింది. కొద్ది రోజుల పాటు ఇల్హా డాస్ వాకాస్ (Ilha das Vacas) లో ఏ పనీ చేయకుండా మౌనంగా ఉండాలని తీర్మానించుకొని వెళ్లిపోయాడు. ఇది శ్రీలంక వాయవ్య తీరానికి దగ్గరలో ఉన్న చిన్న దీవిగా భావిస్తారు. బహుశా రామసేతు ప్రాంతంతో శ్రీలంకను అనుసంధానించే ప్రదేశం కావచ్చు. ఈ ఘటనను జాగ్రత్తగా గమనిస్తే.. ఆనాడు తిరుమల వంటి దేవాలయాలు భారతదేశంలో కేవలం సంపన్నమైనవే కాకుండా రాజ్యానికి, ప్రజలకు ఒక ఆలంబనగా నిలిచే కేంద్రాలుగా వ్యవహరించాయని స్పష్టంగా అర్థమవుతుంది. పోర్చుగీసు వంటి విదేశీ శక్తుల కన్ను పడినప్పటికీ, ప్రజలు, రాజ్యం ప్రతిఘటన ద్వారా తిరుమల దేవాలయం దోపిడీకి గురికాకుండా రక్షింపబడింది.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
