Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ముఖపటము

[అరుణ నిష్ఠల గారు రచించిన ‘ముఖపటము’ అనే గేయాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

ప:
బాల్యావస్థ స్వచ్ఛత మీదుగా కపట ముఖపటమెన్నడు చేరునో ఎఱుగమని
మూల్యము గట్టు వస్తు గణాంకములే జీవన ప్రాముఖ్యమని స్పర్థనుండు

చ.1:
మానవత్వ పరిధులు మరచి ప్రతిఘాతమున కొఱడబారవచ్చు
ఆనుకూల్యములే ఆలంబమని ఆడంబరముల అణగారవచ్చు

చ.2:
ఉచితానుచితము మరుభూమిని నాటిన బీజములు కావచ్చు
అచిరములే చిరములని తీక్షణ రూక్షితముల ఇఱుకు పడవచ్చు

చ.3:
ఏ లబ్ధవ్యము లెట్టివో ఎఱుగని పాషాండుడై లఘువృత్తుల బలుపుకొనవచ్చు
అలబ్ధవ్యము లాశించి చిరతము చింతనల పాలై ప్రయాస పడవచ్చు

చ.4:
ఇభరాజు బోలు మానసము కామితము అంకుశమిడి అరికట్టినట్టైన
అభవము అంచనకైనా అందనిదగును కదా! నారాయణా!

Exit mobile version