ప౹౹ కన్నీటికేమి తెలుసు ఎదలోని బాధ నలుసు దుఃఖానికేమి తెలుసు పగిలిన గుండె మనసు ౹౹ప౹౹
చ౹౹ దూరానే ఉంటావు నువ్వు గుండెనే గుచ్చుతుంటావు జ్ఞాపకంగా మిగిలిపోయావు గాయమై బాధ పెడుతుంటావు ప్రియా నిన్ను మరిచేదెలా మదిలోనే నిండిపో ఇలా ప్రియా నిన్ను మరిచేదెలా నా మదిలోనే నిండిపో ఇలా ౹౹ప౹౹
చ౹౹ కళ్ళల్లోనే మెదులుతుంటావు కలవరమే పెడుతూ ఉంటావు నవ్వులతోనే కవ్విస్తుంటావు వాలుచూపులతో ఊరిస్తుంటావు ప్రియా నిన్ను చేరేదెలా మనసులో నిలిచిపో ఇలా ప్రియా నిన్ను చేరేదెలా నా మనసులో నిలిచిపో ఇలా ౹౹ప౹౹
చ౹౹ ఆశలే రోజూ రేపుతుంటావు కన్నీళ్లలోనే మెరుస్తుంటావు కలలోనే కలవరపెడుతుంటావు కన్పించి మాయమవుతుంటావు ప్రియా నిన్ను చేరేదెలా చిరునవ్వుతో రా ఇలా ప్రియా నిన్ను చేరేదెలా ప్రేమతో రావే ఇలా ౹౹ప౹౹
bagundi.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™