[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘ఓ.. కాలమా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కొందరు ఆవేశంతో..
దురసుగా ప్రవర్తిస్తుంటే
దురాగతంగా చరిస్తుంటే
చేటుకాలం సృష్టిస్తుంటే
రావణ కాష్టం చేస్తుంటే
లీలగా చూస్తున్నావు
ఆ చూపుకు అర్థమేంటో
అవగతం కాని విషయం
కొందరు అవివేకంతో..
కసిని ఉసిగొల్పుతుంటే
పగతో బుస కొడుతుంటే
హింసను అవలంబిస్తుంటే
మానవతని కాటేస్తుంటే
బేలగా ఊరుకున్నావు
నీవు ఊరుకున్నావంటే
ఊహించుకోలేక పోతున్న
దురంతపు దుశ్చర్యలు
పైశాచిక పాపకార్యాలు
దుర్మార్గపు ఆలోచనలు
దురిత దుష్ట పన్నాగాలు
గణించు సంగతులు అనేకం
ఇది స్థాలీపులాక న్యాయం
నీవు ఒక బ్రహ్మ పదార్థం
ఇదొక తన్మాత్రుని తపన
