‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. XLIX (3,3) |
4. ఒక పక్షివిశేషము (4) |
7. లక్షభక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్య కుక్షికి ఇదొక లక్ష్యమా? (2) |
8. గంజి, పాయసం (2) |
9. రజనీకాంత్ సినిమాను కలిగివున్న అగ్నిదేవుడు. (7) |
11. శాస్త్రములు చదివిన మూర్ఖుడు (3) |
13. కుటుంబరావు గారి దర్శకత్వంలో వచ్చిన రివెంజి సినిమా (5) |
14. కారామాస్టారి కేరాఫ్ అడ్రస్‌లో రెండు మూడు అక్షరాలుతారుమారయ్యాయి. (5) |
15. గుబులు (3) |
18. కాపు నాయకుడి పేరులో రెండో అక్షరం లుప్తం. (3,4) |
19. హ్యాపీడేస్ కథానాయికతో రాత్రి (2) |
21. తుమ్మెద (2) |
22. పుస్తకం పైపేజీ బొమ్మ (4) |
23. పార్వతిని కంటివా? (6) |
నిలువు:
1. భవుడు, అభవుడు (4) |
2. ఛేదించడానికో, సాధించడానికో ఇది ఉండాలి. (2) |
3. వివినమూర్తిగారి కరెక్షన్స్ (5) |
5. టేబిలు (2) |
6. భువనవిజయాన్ని పోలిన మరొక సాహిత్యరూపకం (6) |
9. సాధారణ తూతకముతో చేసిన బత్తళిక (7) |
10. వియోగి, రాచపూటి రమేష్, ఎ.వి.యంలు సంకలించిన కథల పుస్తకం (2,2,3) |
11. మేకప్పు (3) |
12. పరిహాసాలు (3) |
13. వంద రూపాయల నోటు (2,4) |
16. ఆంధ్రకల్పవృక్షము (5) |
17. ఎనిమిటి కలిగిన భర్త (4) |
20. ఆశ్లేష,పుబ్బల నడుమ (2) |
21. జ్ఞాతి బంధు సంతతి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 సెప్టెంబరు 20 తేదీన వెలువడతాయి.
పదసంచిక-68జవాబులు:
అడ్డం:
1.తూము రామదాసు 4. ఏకాదశి 7. తక్త 8. ఫార 9. ఏ ఎండ కా గొడుగు 11. ఏవురు 13. ఏణాంకశిల 14. టపాకాయలు 15. కొట్టము 18. మినుసిగదేవర 19. శశ 21. తత 22. తిరగలి 23. లలనాచక్రము
నిలువు:
1.తూతకొమ్ము 2. ముక్త 3. సురకారువు 5. దఫా 6. శిరస్త్రాణములు 9. ఏరువాకపున్నమి 10. గుత్తివంకాయకూర 11. ఏలకొ 12. రుటము 13. ఏకోనవింశతి 16. ట్టపగవంల 17. ఏకాంతము 20. శర 21.తక్ర
పదసంచిక-68కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రాజేశ్వరి కనకగిరి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు కోట
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.