చూడు నీ చేతి వేళ్ళను చూడు
పొట్టిదొకటి పొడుగుదొకటి
దుడ్డుదొకటి దుర్బలమైనదొకటి
ఎగుడు దిగుడుగా అసమానంగా
ఐదింటినీ ఓసారి కలపి చూడు
గట్టిగా బిగించి తెగించి పైకెత్తు
అదే పిడికిలి పిడి కల కత్తి
అన్యాయాన్ని తెగ నరికే శక్తి
ఒక్కడిగా ఉంటే పోరాటం చేయలేవు
సమిష్టిగా ఉంటేనే గరిష్ఠ ఫలం
అందరినీ కలుపుకొని నడువు
పిడికిలి బిగించు గళం ఎత్తు
స్వేచ్ఛ సమానత్వపు సమాజం
నీ పిడికిలితోనే సాధించు
ఓ మానవా మన నవ సమాజం
నిర్మించు శ్రమించు శోధించు..
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.