Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రగతి

[శ్రీ ఎస్. హనుమంతరావు రచించిన ‘ప్రగతి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చిన్నతనాన
చేలల్లో, ఏటి గట్టు మీద
ఆడుతూ పాడుతూ తిరుగుతూ
రంగు రంగుల పక్షి ఈకల్ని
ఏరుకుని
బడి పుస్తకాల్లో దాచుకుని మురిసిపోయాను

ఇప్పుడు
దర్జాగా
బర్డ్స్‌ కేజ్‌ని బజార్లో కొనుక్కుని
నా బాల్కనీలో పెట్టుకున్నాను
ఖాళీ దొరికినప్పుడు వాటిని చూస్తూ ఆనందిస్తున్నాను
అవి ఇప్పుడు నా బందీలు..
నేను బజార్‌కి బందీ!

Exit mobile version