[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘ప్రకృతి ఒక అద్భుతమైన ప్రయోగశాల!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
క్లామిడోమోనాస్ – పచ్చని నాచు, మిల్లీ మీటర్లో వందో వంతు (1/100th M.M) ఉంటుంది. ఈ నాచులో ఉండే ప్రత్యోకమైన ప్రోటీన్స్ ఛానల్ ‘రోడాప్సిన్’. వీటి సాయంతో సూర్యకాంతి అందే చోటికి పెరుగుతుంది. కిరణజన్యసంయోగక్రియకు ఆటంకం కలగకుండా రోడాప్సిన్స్ కాంతి ఉన్న చోటుకు ఈ నాచును విస్తరిస్తుందన్న మాట. అంటే ప్రోటీన్‌కు కాంతికి అనుగుణంగా స్పందించే గుణం ఉంది.
శాస్త్రజ్ఞులు ప్రయోగశాలలో ఈ ప్రోటీన్‌ని కృత్రిమ మెదడులో ప్రవేశపెట్టి అవయవాల పనితీరును పర్యవేక్షించడం; కాంతి సాయంతో వాటి కదలికలను నిర్దేశించడానికి తద్వారా దీర్ఘకాలిక నాడీరుగ్మతలను డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా స్విచ్ ఆఫ్/ఆన్ చేయడానికి ప్రయోగాలు చేస్తున్నారు.
కెండల్ – అమెరికా స్టార్డప్ – ‘వైర్లెస్ రౌటర్ (రూటర్) ఫర్ ది బ్రెయిన్’ కాంతితో మెదడును నియంతరించగలదు.
పాన్ – చైనా శాస్త్రజ్ఞులు ఈ ప్రోటీన్‌ను కృతిమంగా తయారు చేసి మెదడుతో చూపును నియంత్రించే గాంగ్లియన్ కణాల స్థానంలో ప్రవేశపెట్టి ఫలితాలను పొందవచ్చని నిరూపించారు.
న్యూయార్క్ – బుఫాలో యూనివర్శిటీ – మూలకణాలతో ఆర్టిఫిషియల్ బ్రెయిన్, దానికి అమర్చిన వైర్లెస్ పరికరాలతో కాంతిపుంజాలు పని చేయడం మొదలుపెట్టి F.G.F.R.I అనే బాస్ జీన్‌ని ప్రేరేపించడం, నిర్వీర్యం చేయడం చేయగలిగారు. పైన పెర్కొన్న బాస్ జీన్ F.G.F.R.I – 4500 జీన్స్‌ను నియంత్రిస్తుంది (ప్రేరేపించడం/నిర్వీర్యం చేయడం). పసితనం నుండే చివరి దాకా ఆ విధంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆప్టో జెనెటిక్స్.
ఆప్రికాకు చెందిన ‘లేవిస్’ జాతి కప్పలు –
ఇవి కొంచెం ప్రత్యేకమైనవి. వీటి పిండకణాలను ఎటువంటి అవయవంగానైనా రూపొందించగలగేలా శాస్త్రజ్ఞులు ఆల్గారిదమ్స్ను రూపొందించారు. అలా ఒక మిల్లీ మీటరు ఉండే ‘జెనోబాట్’ను రూపొందించారు. దీని గుండె కండరాల సంకోచ – వ్యాకోచాలు ఒక పద్ధతిలో అవరోధలను దాటుకుంటూ ముందుకు సాగిపోవటానికి సహకరిస్తాయి. శరీరంలోని రోగగ్రస్థమైన/నిర్దిషమైన ప్రాంతానికి లక్ష్యంగా పంపితే అక్కడికి మందును చేరవేసి, తరువాత శరీరంలో కలసిపోయి మృతకణాలుగా మారిపోతాయి.
సాలీడు –
ఈ జీవి నుండి తయారు చేసిన దారాలు/పోగులు (స్పైడర్ సిల్క్) తో గాయాలను నయం చేయవచ్చని పరిశోధనలు తేల్చి చెప్పాయి. స్పైడర్ సిల్క్‌తో చేసిన గ్లౌవ్స్‌ను గాయాలపై తక్షణ డ్రెస్సింగ్‌గా వాడవచ్చు. గాయంపై ఈ దారాలను నేరుగా గాయానికి అనుగుణమైన రీతిలో చుట్టవచ్చు. ఈ డ్రెస్సింగ్ సురక్షితమైనదే దృడమైనదే కూడా. వైద్య ఆరోగ్య రంగంలో మరింత సురక్షితమైన విధానాల కోసం శాస్త్రజ్ఞులు నిరంతరం కృషి చేస్తూనే వస్తున్నారు.
ప్రయోగశాలలో తయారు చేయబడిన ఆర్గనాయిడ్ మెదళ్లు క్లినికల్ ట్రయల్స్ దశకు రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. మానవ శరీరంలోని అంతర్గతమైన సిక్స్త్ సెన్స్‌ని మేప్ చేయడానికి తీవ్రమైన కృషి జరుగుతోంది. DNA ట్రాన్స్క్రిప్షన్కు సంబంధించీ విసృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్ర విజ్ఞానం ఒక మహా సముద్రం. దిగిన కొద్దీ బయటపడే అంతులేని అద్భుతాలు. అదే ఆలంబనగా శాస్త్రజ్ఞుల జిజ్ఞాస నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
