Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉగాది పాట

[19 మార్చ్ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా డా. కోగంటి విజయ్ గారు రచించిన ‘ఉగాది పాట’ అందిస్తున్నాము.]

స్వాగతమ్ము ఉగాదికి
సంబరాల జగానికి
సిరివెలుగులు కురిపించే
చివురాశల యుగానికి – ॥స్వా॥

గున్నమావి గుబురులలో
గుబాళించు ఉగాది
ఎల కోయిల గళమున
బలె రవళించెడి ఉగాది
ప్రకృతికాంత కన్నులలో
కాంతిరేఖ ఉగాది -॥స్వా॥

వసంత ఋతు విలాసాల
తొలి సంతక ముగాది
మోడువారు జీవితాల
పచ్చ చిగురు ఉగాది
నూతన శోభాలక్ష్మికి
తొలి తోరణ ముగాది -॥స్వా॥

Exit mobile version