బానిసత్వం నుంచి బయటపడ్డ నా దేశ ప్రజలు
మతం అనే చీకటి గోడలను చెరుపుకొని,
లౌకికత్వ భావనలను పెంపొందిస్తూ,
కుల, మత, జాతి, లింగ, వర్ణ, ప్రాంతీయ భేద భావాలను
సమూలంగా నిర్మూలిస్తూ,
అజ్ఞానపు అంధకారాన్ని విద్య అనే
వెలుగుచుక్క తో పారద్రోలుతూ,
నా దేశ ప్రజలకు తరతరాలుగా వస్తున్న
అద్భుతమైన మేధాశక్తిని అణువణువు ఉపయోగించుకుంటూ,
ఈ జగతిలోనే నన్ను మేటిగా నిలబెడతారని ఆశిస్తూ…
మీ
భరతమాత
మిత్రులు రామనాథ్ గారికి హృదయపూర్వక అభినందనలు. వారు ఈ కావ్యాన్ని ప్రకటించేందుకు అవకాశం ఇచ్చిన ఈ పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు.