గడ్డిపరక కూడా కొన్నివాక్యాలను చేతికందిస్తుంది పరకలోకి పరకాయప్రవేశం చేసి గాలిపదునును, మెత్తదనాన్ని తనువుకు గంధంలా పూసుకుంటున్నాను!!
కట్టెపుల్ల కూడా కవిత్వాన్ని పలికించగలదు నదిలోని గలగల సవ్వడులనే కవిత్వం చేయాలని భ్రమలకు పోతున్నా కానీ దేని ఆత్మను వెలిగించినా కవిత్వమవుతుందని ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నా!!
ఎక్కడెక్కడో వెతుకుతున్నా అనవసరంగా కొన్ని పదాలను అతుకుతున్నా గాని సంతృప్తి కరువు!!
నిప్పులతో కూడిన పదాలవంతెనపై బుడిబుడి అడుగులు వేస్తున్నా కాని తేలిక పదాల కవిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నా!!
ఎక్కడెక్కడో వెతుకుతున్నా గాని పక్కపక్కనే ఉన్న సంగతులను కవిత్వం చేయాలేకున్న!!
ఇకనైన వెతకడం మాని అతకడం మాని, నిజజీవితాలను కవిత్వీకరించాలనుకుంటున్నా కవిత్వం పేరుతో ఆ భావాలను రాసుకోవాలనుకుంటున్నా!!
వలసపిట్ట..!!
విద్యార్థి విజయానికి సారథులు ఉపాధ్యాయులు
బహుమతి పొందిన కథల విశ్లేషణ-3
‘మన పుణ్య వృక్షాలు – వేప చెట్టు’ పుస్తక ఆవిష్కరణోత్సవ సభ ప్రెస్ నోట్
కరోనా
వాణి గల బ్రహ్మ..!!
కొరియానం – A Journey Through Korean Cinema-5
ఆచార్యదేవోభవ-25
సినిమా క్విజ్-51
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®