సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    Dr Trinadharaju Rudraraju

    కవులు వారి సమయానికి వారే రాజులేమో కాని సంఘంతో (ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలతో) పని ఉన్న సాధారణ వ్యక్తికి అది చెప్పుచేతల్లో ఉండదు. రచయిత్రి సమయ భావన, పాలన మరియు దాని విన్యాసాలను బాగా చిత్రీకరించారు.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వాహ్.. మళ్ళీ మొదలైంది ఒక కొత్త ఉత్సాహం.. మీ సరికొత్త రచనతో.. ఇక వారం వారం ఆదివారం కోసం ఎదురుచూపులు.. మీతో పాటు ప్రయాణం… కాసేపు లోకం మర్చిపోవడం.. ఆనందం చిందులేస్తుంది మనసులో.. ఈ వారం ఎపిసోడ్ లో కళ్ళముందే కరిగిపోయే కాలం గురించి అత్యంత సహజంగా.. యథార్థంగా జరిగే.. జరుగుతున్న సంఘటనల తోరణంతో మమ్మల్ని ఆకర్శించారు.. మీ సునిశిత హాస్య చమత్కారంతో మురిపించారు.. అభినందనలు చెల్లీ.. 💐💐 షేక్ కాశింబి, గుంటూరు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందుకూరి దుర్గ గారి వ్యాఖ్య: *ఇప్పుడే చదివాను. చాలా బాగా రాశావు. ఈమధ్య కాలం పరుగు పెట్టడంకాదు, హై జంప్‌లో వెళ్ళిపోతోంది. ఇందుకూరి దుర్గ, వైజాగు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం.వి. రమణ గారి స్పందన: * కాలం లొంగే ఘటమా! శీర్షికతో అల్లూరి గౌరీలక్ష్మి గారు వ్రాసిన రైటప్ ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది. రచన శైలి హాస్యగంభీరతల మిశ్రమంగా ఉన్నప్పటికీ, సారాంశం ఎంతో అసాధారణమైనది. ఎందుకనో, ఆ రచన నా గురించి రాశారేమోనన్న భావన కలిగింది. ఇది అందరికీ కలుగుతుంది. ఎందువల్లనంటే కాలాన్ని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరు. మనం ఎన్ని కట్టదిట్ట ప్రణాళికలు వేసుకున్నా, కాలం గుప్పిట్లో ఇసుక లాగా జారిపోతూనే ఉంటుంది. కాలం విలువ గుర్తు చేయడానికి సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ ఎంతో ఉపయాగపడుతుంది. చక్కని విషయాలు తెలిపినందుకు రచయిత్రికి అభినందనలు. 💐💐 MV రమణ, Retd. Principal.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *ఉగాది పండగ సమయంలో సమయపాలన గురించి చెప్పడం చాలా బాగుంది. బాగా చెప్పారు. GS Lakshmi.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. సురేష్ గారి స్పందన: *మీ వ్యాసం బాగుంది. Suresh P. *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సంగీత గారి వ్యాఖ్య: *రంగుల హేల కాలం లొంగే ఘటమా – ఈనాటి కాలానికి చక్కని సందేశం. సంగీత (ముత్యాల ముగ్గు).*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మృణాళిని గారి స్పందన: *బాగుంది.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోళ్ళ నారాయణ రావు గారి స్పందన: *[19:21, 4/8/2025] Alluri Gouri Lakshmi: రంగులహేల లో కాలం గురించి అల్లూరి గౌరీ లక్ష్మి గారు వ్రాసిన వ్యాసం చదువుతుంటే కాలం తెలియలేదు. కాలం వృథా కాదు వృద్ధి అయిందనిపించింది. పువ్వు పుట్టగానే పరిమళిoచినట్లు, ఆమె గౌనులు వేసుకున్నప్పటి నుండీ రెబెల్ అని అర్థం అయ్యింది.
    కాలాన్ని కేకు తో పోల్చడం కేక పెట్టించింది. సభల్లో కొందరి ప్రసంగాలు మన సంతోషాన్ని రాజేస్తాయి మరి కొందరివి కాజేస్తాయి, అనే వాస్తవాన్ని విస్మరించలేం.
    “కాలాన్ని ఒడిసిపట్టాలి లేకపోతె డోసిట్లోని నీళ్లు జారిపోయినట్లు జారిపోతుంది”, అని చెప్పిన రచయిత్రి మాస్టారుకు నమస్సులు.
    “విశ్రాంత ఉద్యోగస్థులం అయ్యాక శరీరం చాలా గారాలు పోతోంది, చెప్పిన నొప్పి చెప్పకుండా కొత్తగా కొత్తవి చెబుతోంది”, పెరిగి(ముదిరి)న వయసు గురించి మంచి వర్ణన.
    “కాలం క్లాసుకి లేటుగా వచ్చి త్వరగా వెళ్లిపోయే పిల్లల్లా తప్పించుకుంటూ ఉంటుంది” మంచి పోలిక.
    మనం పెద్దలు కల్ కరేసో ఆజ్ అని, తొందరపడి ఒక కోయిల అని చెప్పి మనల్ని తికమక పెట్టడం మనకందరికి అనుభవమే.- గోళ్ళ నారాయణ రావు, విజయవాడ.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎన్. విజయలక్ష్మి గారి వ్యాఖ్య: *చాలా బావుంది కాలమ్. N. విజయలక్ష్మి.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శేషమ్మ గారి స్పందన: *బాగా బాగా రాశారు కాలం ఎవరికీ లొంగే ఘటం కాదు. జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పటితరం వాళ్లకి ఆనాటి క్రమశిక్షణ, సమయ పాలన లేదు. – శేషమ్మ,కాకినాడ.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గాయత్రి గారి వ్యాఖ్య: *Waking nunchi ragane wats app chudadam alavatu chudagane alluri gouri garu vrasina rangula hela 54 kalam longe ghatama kanipinchindhi sare ragane aasakthiga chadhavadam modhalu petta chadhuvuthune chadhuvuthune unna akkada chusina balyam dhaggaranunchi nene kanipinchanu last mata gouri antaru ina manamemanna kaliga unnama ani akkada kaligaunnamu ippatiki kaligalemu gouri ami vrasina manishi jeevithalaku athi dhaggaraga chusinatte untundhi intha manchi sanchika udhayanne nannu longadhisukoni chadhdhivela chesina ma gouri gariki dhanyavadhalu. – గాయత్రి, Hyd.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణు మాధవ్ గారి స్పందన: Time Management.. Money Management కంటే కష్టం మేడం.. కాలానికి అందరూ బానిసలే.. చక్కగా వివరించారు 👍🏻🙏🏻 – Venu Madhav, మంగళగిరి*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చిలుకూరి వెంకటేశ్వర్లు గారి స్పందన *రచయిత్రి గౌరీలక్ష్మికి, కాలము గూర్చి నీ రచన చదువరులను ముఖ్యముగా నా తోటి వృద్ధులను కూడ మంత్రముగ్ధులను చేసి కొంత సమయము (కాలము) గడుపునట్లు చేసినది. తదుపరి ఈ విధముగ మెచ్చుకోలు వ్రాసి సంతసించితిని. ఆశీస్సులతో, చిలుకూరి వెంకటేశ్వర్లు మాస్టారు, హైదరాబాద్, 11.04.25.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *”కదిలే కాలమా!కాసేపు ఆగవమ్మా!” అన్నారు సినీ కవి. అందుకే కాలాన్ని ఆగమని అర్థించారు ఆ కవి. కాలం మనకోసం ఆగదు. మనమే దాని వెంబడి ఉరకలేస్తూ, పరుగులెత్తి పనులు చేసుకోవాలి. ఒకప్పుడు చదువులు, ఆటలు, పాటలతో ప్రశాంతంగా హాయిగా కాలం గడిచిపోయేది. ఇప్పుడు మనోవేగం కంటె కాలవేగం ఎక్కువయింది. కొంత కాలవ్యవధి తర్వాత పునఃప్రారంభమైన ‘రంగుల హేల’ని ‘కాలం లొంగే ఘటమా’ శీర్షికతో మొదలు పెట్టారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి. మన చేతిలోంచి కాలం జారిపోతుంది. జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. ఆవిడ ప్రస్తావించిన అంశాలన్నీ ఆచరించదగ్గవే! కానీ వారివారి పరిస్థితులను బట్టి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ నెట్ యుగంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం చాలా ఉంది. మంచి అంశం తీసుకుని తన సహజశైలిలో చమత్కారంగా, హాస్యం జోడించి, నవ్విస్తూనే కర్తవ్యం బోధించిన గౌరీ మేడమ్ గారికి అభినందనలు. – పుట్టి నాగలక్ష్మి*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి వ్యాఖ్య: *అనేందు కేముంది, కల్ కరే సో అజ్.. ఉన్నదున్నట్లు రాయటం, మెత్తగా మొట్టికాయలు వేయటం, నిజమేకదా అనుకోటం, చివరగా చిన్న నవ్వు పెదవులపై పూయించటం. మీ కలం, మీరు ఒక్కటే. మీకు గాఢమైన ఇష్టం ..అందిస్తున్నాను అందుకోండి.👏👏😍, మల్లిక్, బాపట్ల.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!