ఇది 2018 లో వచ్చిన సైకలాజికల్ హారర్ లఘు చిత్రం. పావు గంట/21 నిముషాల నిడివిలో మూడు కథలు ఇంత చక్కగా కలిపి చెప్పడం, అదీ సినెమేటిక్ గా అన్నది మెచ్చుకోతగ్గ విషయం.
మొదటి షాట్ యే విండ్ చైంస్ ది. శబ్దం చేస్తూ వూగుతూ వుంటుంది. తర్వాత నల్లటి తెర. మగ గొంతు అభీక్ ని కోప్పడుతుటుంది. వో ఆడ గొంతు అతన్నలా వదిలెయ్యండి అతని మానాన అంటుంది. ఆ జంట సాన్యాల్ (సత్యజిత్ శర్మ) అతని భార్య (వర్జీనియా రోడ్రిగ్స్) ల సంభాషణ. అభిక్ వాళ్ళ కొడుకు. మొదటి నుంచీ తండ్రికి కొడుకు అంటే చిరాకు, కోపం. అతను చదువులో వెనకబడ్డ పిల్లవాడు. సాన్యాల్ కుటుంబమంలో అందరూ IIT,Lawers,IAS వగైరా. వీడు తమకెలా పుట్టాడో అంటాడు తల పట్టుకుని. అందుకే పేరెంట్ టీచర్ మీట్ కు వెళ్ళడం ఇష్టం వుండదు. అయితే అభీక్ కి నాటకాలంటే ఇష్టం. సినిమాలో ఎక్కడా ఒక్క మాటా మాట్లాడకుండానే చాలా కథ చెబుతాడు ఈ అబ్బాయి.
ఒక ఇల్లు 20 ఏళ్ళ పాతది అమ్మకానికి వుంది. రేటు కూడా తక్కువే. అది చూడడానికి వెళ్తారు వీళ్ళు. దుబే అన బ్రోకర్ (గోపాల్ దత్) ఇల్లు చూపిస్తూ అతి ఉత్సాహంగా కథలన్నీ చెబుతాడు. ఆ ఇంట్లో మూడు కుటుంబాలున్నాయి ఇదివరకు అంటాడు. అతను చెబుతున్న ఒక్కో కథలోని పాత్రలు వాళ్ళ మధ్యనుంచే నడుస్తూ వెళ్ళి తమ పాత్రలు పోషిస్తాయి. ఈ టెక్నిక్ ఇదివరకు ఉన్నదే అయినా ఈ సినెమాకు బాగా సూట్ అయ్యింది. ఎందుకంటే మూడు కథలనూ పధ్ధతిగా కలపాలి. ఇంకా కలిపే ఇతర అంశాలు వస్తువులు. విండ్ చైంస్, గన్, దేవుని మూర్తి వగైరా. మొదటి కథలో కొడుకు లావుగా వుండడం వల్ల మంచి సంబంధం కొరక్క తల్లి (అయేషా రజా) చిరాకు పడుతుంటుంది భర్త (కుముద్ మిశ్రా) మీద. నెమ్మదిగా కొడుకు నోరు విప్పుతాడు, తను ఇదివరకే వొక అమ్మాయిని ఇష్టపడ్డాడని. అయితే ఆ అమ్మాయి హిందూ అగ్రజాతి అమ్మాయి కాకుండా వొక ముస్లిం అమ్మాయి. భరించలేని తల్లి బాల్కనీ నుంచి దూకి చనిపోతుంది.
రెండో కథలో వేరే జంట కాని నటులు వాళ్ళే. భర్త రెటైర్ద్ మిలిటరి ఆఫీసర్. వాళ్ళ పద్దెనిమిదేళ్ళ కూతురు ప్రేమలో పడి కడుపు తెచ్చుకుంటుంది. ఆమెకు తను చేసిన పని మీద అపరాధ భావన లేనే లేదు. ఆ బిడ్డను నిలుపుకోవాలని కోరుకుంటుంది. తండ్రీ కూతుళ్ళ మధ్య గొడవ. కూతురు ఏ మాత్రం తగ్గకుండా తండ్రితో వాదిస్తుంది. తన పరువు మర్యాద ల ఆలోచనలతో ఆ అహంకారి గన్ తో షాండ్లీర్ ని షూట్ చెయ్యడం, అది కూతురి మీద పడి ఆమె మరణించడం జరిగిపోతాయి. తిన్నగా ఎందుకు కాదు? షాండిలీర్ ఒక స్టేటస్ సింబల్ కూడా కదా.
సాన్యాల్ భార్యకు ఇల్లు కొనడం ఇష్టం లేదు. సాన్యాల్ ఇంత మంచి బేరం పోనివ్వకూడదంటాడు. వెళ్ళాల్సిన సమయం అయ్యింది. కొడుకు పైనెక్కడో వున్నాడు. వాణ్ణి కేకేస్తూ పైకి వెళ్తాడు సాన్యాల్. ఆ అబ్బాయికి బీరువా కింద గన్ కనిపిస్తుంది. అతని చేతి సంచి లో పుస్తకం, అందులో దాచుకున్న డబ్బులు, ఫ్రూటి, తను నాటకాలలో నటించినప్పటి ఫోటోలు : ఇలాంటివన్నీ వుంటాయి.వొక పేస్ట్ తో మూతికి జోకర్ లాగా మేకప్ చేసుకుంటాడు. వెతుకుతున్న సాన్యాల్ వొక గదిలో బందీ అయిపోతాడు, గాలికి తలుపుకి లాక్ పడి. (వాస్తవానికి ఇదే మొదలు. ఇదే చివర. ఇక్కడి నుంచే ఆ బందీ అయిపోయిన తండ్రి అంతా గుర్తు తెచ్చుకుంటాడు. నిజంగా ఆ ఇంట్లోనే ఎదో వుందా? లేక మనిషి తాను నిర్మించుకున్న భావజాలానికి బందీ కావడమో, బలి కావడమో జరుగుతుందా?) కొడుకు మీద లోపలినుంచే అరుస్తూ వుంటాడు. ఆ నాటాల పిచ్చి తో పారిపోదామనుకుంటున్నావా? పోయినసారి పారిపోతే ఏమయ్యిందో గుర్తుంది కదా. రోడ్డు మీద బికారిలా పడుంటే తీసుకొచ్చాం. ఈ సారి నిన్ను పట్టించుకునేది లేదు. అంతా వింటున్న అభీక్ తన సామాను సంచిలో సర్దుకుని పారిపోతాడు.
ఇక మూడవ కథ వొక ప్రోగ్రెసివ్ కవిది (మళ్ళీ కుముద్ మిశ్రానే). అతను హిందీలో కవిత్వం వ్రాస్తుంటాడు, లెక్చరరు. అతని కొడుకూ, అతని ఒక శిష్యుడూ కలిసి అతని వొక కవితా సంపుటిని అనువదించారు, అది త్వరలో అచ్చులోకి రాబోతుంది. కవి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి కవిత వినిపిస్తాడు. ఇది అనువాదం కష్టమే అయినా ప్రయత్నించండి అంటూ లోపలికెళ్తాడు. ఆ శిష్యుడు అంటాడు ఇదే సమయం చెప్పేద్దామా అని. నాకు ఆయన ఇష్టమైన గురువు, ఒకవేళ ఆయనకి ఈ విషయం నచ్చకపోతే నేను నా మనసులోని మాటను లేఖ రూపంలో అతనికి వ్రాసి పెట్టాను, అదిస్తా. ఇద్దరూ లోపలికెళ్తారు. అనువాదం అని చెప్పి ఇచ్చిన కాగితం వాస్తవానికి అతను వ్రాసిన లేఖ. అది చదివి కవి మ్రాన్పడిపోయాడు. ఇద్దరు కుర్రాళ్ళూ కౌగిలించుకుంటారు. చూచాయిగా వాళ్ళ మధ్య గే సంబంధాన్ని సూచించబడింది.
ఇక దీన్ని నాల్గవ కథ అనాలేమో.
రెండు దశాబ్దాల కాలం గడిచినా పిల్లల మీద తల్లిదండ్రుల పెత్తనం పోవకపోవడం చూస్తాము. రెండు పాత్రలు చనిపోవడం, మూడవ పాత్ర పారిపోవడం అన్నది ఆ తీవ్రతను తెలియ చేస్తుంది. ఇలా కథగా చెప్పుకోవడం అన్నది తెరమీద స్క్రీన్ప్లే విన్యాసానికి సరికాదు. ఆ ఊహ, దాన్ని ఎక్సెక్యూట్ చేసిన తీరూ చాలా బాగున్నాయి. దర్శకుడు శుభాజిత్ దాస్గుప్తా. ఇతను ఇదివరకు పరిచయం చేసిన “నీంద్” అన్న చిత్ర ద్రశకుడు. ఈ చిత్రానికి చాలా అవార్డులొచ్చాయి. దర్శకత్వం, ఎడితింగ్ (శుభాజిత్ దాస్గుప్తా), స్క్రిప్త్ (శుభాజిత్ దాస్గుప్తా,సందీప్ శంకర్లు) లకు. చాలా ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. మూడు పాత్రలలో కుముద్ మిశ్రా, రెండు పాత్రలలో అయేషా రజా, దుబే గా గోపాల్ దత్ చాలా బాగా నటించారు. నీల్ దత్ సంగీతం, అరుణ్ జేంస్ చాయాగ్రహణం కూడా చాలా బాగున్నాయి.
ఈ చిత్రం యూట్యూబ్ లో వుంది. చూడండి. కాని అది 15 నిమిషాల నిడివి కలది. మూడో కథ వుండదు. ఆ విషయం కూడా మనకు స్ఫురించదు. ఇలాగైనా పూర్తి చిత్రం లానే వుండి. కాని 21 నిముషాల పూర్తి చిత్రం చూడాలనుకుంటే vidsee.com లో చూడండి.
https://www.viddsee.com/video/chimes/7mrya?locale=en
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జీవన రమణీయం-75
సత్యాన్వేషణ-1
మనం
అలసిన కళ్ళు
కలక నీరు
శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-6
నగరంలో మరమానవి-9
పొద్దుగాల లేస్తా
సంచిక – పద ప్రతిభ – 86
అద్వైత్ ఇండియా-12
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®