[డా. సి. భవానీదేవి రచించిన ‘ఆమె ఎవరు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అనాది అపరిచిత ముహూర్తంలో ఎవరో శిల్పి అటుగాపోతూ అందమైన శిలను ‘ఆమె’గా మలిచాడు పేరేమిటో ఇద్దరికీ తెలీదు ఎండకూ వానకూ ఎదురీదుతున్నప్పుడు రాతిచర్మం కమిలిపోయింది గాలికి శిల్పశిరోజాలు అల్లల్లాడుతుంటే సూర్యతాపాన్నీ.. చంద్రుని చల్లదనాన్నీ చీకటి వెలుగుల క్షితిజరేఖలుగా ధరించింది
రాతిప్రకంపనల ఆలోచనలతో జీవమున్నా లేనట్లుగా గాఢనిద్రిత చైతన్య మూర్తిమత్వంతో భూమ్యాకాశాల ప్రతిస్పందనే లేకుండా చిన్నరూపంలోనే విశాలప్రపంచం దాచుకుంది
సంగీతస్వరాల శబ్దలయలతో సంతోషాభిరుచిని గళంలో నింపుకున్నది కేవలం ఒక రాతిబొమ్మా? ఏదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకపోయినా అన్నీ గుర్తుంచుకుంటుంది
శిలలా.. కంపించినా.. స్వప్నించినా నులివెచ్చని ప్రభాతకిరణాల గుసగుసలన్నీ రాతిశ్రవణాలకు సుతిమెత్తగా వినిపిస్తుంటాయి గాలి వేలికొసల్లోంచి జారే వానముత్యాలు చెక్కిళ్ళపై ప్రతిబింబాలను చూసుకుంటాయి
ఎంతటి సుకుమార సౌందర్య భువన భాగస్వామిని! ఎవరో ఎవ్వరికీ తెలియకపోతేనేం? కాలం ఆమెలోకి ప్రవహిస్తోంది జీవితం ఆమెలోంచి ప్రయాణిస్తోంది!
‘జీవితం ఆమెలోంచి ప్రయాణిస్తుంది’ అన్న ముగింపు..లో చాలా అర్థం ఉంది
శిల కావచ్చు, స్త్రీ కావచ్చు “కాలం ఆమెలోకి, జీవితం ఆమె లోంచీ ప్రవహించడం” మాత్రం ముమ్మాటికీ సత్యం భవానీ గారు.👌
Naatini raathigaa chesina purushaadhikya saapama? Leka raatini naathigaa maarchina kaala prabhaavama? Chustu mounangaa kavithaa gaanam chestunna kavi hrudayamaa? Kaalam manasuku sambhamdichindi. Congratulations 🎊 👏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
యువభారతి వారి ‘నన్నయ కవితా వైభవం’ – పరిచయం
‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-4
అంతరం-7
యువభారతి వారి ‘కావ్య లహరి’ – పరిచయం
విమర్శకుల సమూహం
సినిమా క్విజ్-59
జజ్మెంటల్ హై క్యా? : ఒక సినెమేటిక్ అనుభూతి
తెలికడలి సుడులలో -2
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-8
కొత్త పదసంచిక-7
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®