జీవితంలో పెద్ద ఆశయాల్ని శ్రమతో సాధించి
ఎక్కాలనుకున్న ఎత్తులన్నీ ఎక్కి చూపించి
సక్రమంగా, తృప్తిగా బాధ్యతల్ని నిర్వహించి
నేడు చిన్న, చిన్న ఆశలు తీరక బేలలైపోయాం
గాల్లోని శత్రువుని మాస్క్‌తో ఎదుర్కొంటూ
పరిశుభ్రత మంత్రంతో సబ్బు చేతబట్టి
వార్తలు వింటూ, చూస్తూ ఊపిరి బిగబట్టి
తలనిండా నింపుకుంటున్నాం వైరాగ్యం
ఉషోదయపు నడకే దూరమయ్యింది
చల్లని పైరగాలే ప్రమాదకరయ్యింది
నిత్యం చేసే ప్రతికృత్యం కలగా వస్తోంది
ఏ నాటికైనా అవి తీరేనా అనిపిస్తోంది
తోటి మమనుషుల్ని ప్రియంగా పలకరించాలని
సాహిత్య సభల్లో పెద్దల ప్రసంగాలు వినాలని
ఆత్మీయ మిత్రుల్ని ఆలింగనం చేసుకోవాలని
పరిహాసాలాడే నేస్తాలతో పగలబడినవ్వాలని
ఇవన్నీ మనం నిత్యం ఊహిస్తున్న స్వప్నాలే
నెరవేరతాయని నూరుశాతం నమ్ముతున్నవే
ఎదురుతెన్నులై ఆ రోజు కోసం చూస్తున్నవే
జాగ్రత్తల తపస్సులు ప్రతివారూ చేస్తున్నవే
మంచికాలం త్వరలో తలుపు తడుతుందని
మూసినగుమ్మం తోరణాలతో మౌనంగా నిలబడింది
నేడు ప్రపంచ జనావళి ఆర్తీ, ప్రార్థనా ఒకటే
అదే…లోకాస్సమస్తా ఆరోగ్య భద్రాభవన్తు!

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
13 Comments
Swaroop
Very well said. This is our new normal
పుట్టి. నాగలక్ష్మి
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కనిపించని శత్రువు తో ‘రణం’ లో పాల్గొంటూనే మంచిరోజుల కోసం ఎదురుచూస్తూ… ‘ఆశల తోరణాలు’ అల్లుతున్నారు…విశ్వమానవాళి ఆకాంక్షను మీ కవితలో తేటతెల్లం చేశారు… అభినందనలు గౌరీ లక్ష్మి గారూ!


Swaroop
Very well said. This is the new normal the world is living in.
G.S.lakshmi
నిజమే.. లోకమంతా ఆరోగ్యకరంగా మారాలని ఆ దేవుడిని ప్రార్ధిద్దాం..
కొల్లూరి సోమ శంకర్
Excellent, Chala bavundi
Syamalamba
కొల్లూరి సోమ శంకర్
Super chala bagundi. Eppudu elage manchi rachanalu chevalier. 4 th para four lines
very nice. 
⚘


Kalavathi
కొల్లూరి సోమ శంకర్
Wonderful గా ఉంది
అర్జున
కొల్లూరి సోమ శంకర్
నిజమే మేడం…. నాలుగు గోడల మధ్య జీవితం ఐయిపోయింది…. ఎప్పుడు మన చిన్ని కోరికలు తీరతాయో… బాగుంది. బాగా రాసారు… మనసులోని బాధను….



Venumadhav
కొల్లూరి సోమ శంకర్
Baavundi gowree
లత
కొల్లూరి సోమ శంకర్
మీ కవిత బావుంది గౌరీ ! దిగులు హృదయాల్లో ఆశలు రేకెత్తించేలా ….
Nellutla Ramadevi
కొల్లూరి సోమ శంకర్
Poem of the hour… too nice… mee swaramtho andaram swaram kaluputhunnaam chelli
Kaasimbi
కొల్లూరి సోమ శంకర్
మంచికాలం ఎప్పుడొస్తుందో..ఎదురుచూస్తున్న..
G.Pramila
కొల్లూరి సోమ శంకర్
ఆశలతోరణాలు – నిజం అవ్వాలని ప్రార్ధించడం బావుంది
Goteti lalita