నాడు…!
పంచశీలతో నెయ్యమందించి
నేడు…!
బాహ్య వలయాన్ని యుద్ధ మేఘాలతో బంధించి
అంతర్భాగాలలో కోవిడ్ కల్లోలాన్ని సృష్టించి
సరిహద్దు దేశాల కలుపుకుని
ధ్వజమెత్తినా ధీరలై నిలిచాం…!
ఊహూఁ
మీకు కరోనా చాలదు…
మేమూ ఉన్నాం…!
భూకంపాలు, తుఫాన్లు,
వరదలు, మిడతల దం(డు)డయాత్రల
ప్రకృతి ప్రకోపం…!
నలుమూలలా వెల్లువెత్తిన
పారిశ్రామిక విషవాయు విలాపం…!
ఎన్ని విలయాలెదురైనా
ఎదురొడ్డి పోరాడుతాం!
ఏకత్వంలో భిన్నత్వం
భిన్నత్వంలో ఏకత్వం
ఏకైక ఐక్యతా సూత్రం!
ఎప్పటికీ విజయం మాదే! మాదే! మాదే!
మాదీ…!
ఆత్మ నిర్భర భారతం.

8 Comments
alluri gouri lakshmi
ఆత్మ విశ్వాస భారతం. బావుంది. Lakshmee..
పుట్టి. నాగలక్ష్మి
ధన్యవాదాలండి
నిడమర్తి రామయ్య
అలది అలది పదాలు
లోతైన భావాలు
చదివిన తర్వాత వెంటాడే
తెలుగు మాటల జిగిబిగి
నాలుకపై తేనెచుక్క రుచుల జాడలు
కవయిత్రి కవితా గానం ( రచన )
ఆత్మనిర్భర భారతం
శుభాకాంక్షలు. నమస్కారం
నిడమర్తి రామయ్య అడ్వకేట్ గుడివాడ
పుట్టి. నాగలక్ష్మి
ధన్యవాదాలు రామయ్య గారూ
నరహరి శెట్టి ప్రసాద్
దేశ సమైక్యతను చాటుతూ పుట్టి నాగలక్ష్మి గారు వ్రాసిన కవిత చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హద్దులు మీరుతున్న పొరుగు దేశానికి ఒక హెచ్చరికలా ఉంది. రచయిత్రి అభినందనీయులు.
పుట్టి. నాగలక్ష్మి
ధన్యవాదాలు ప్రసాద్ గారూ
ఉషారాణి పొలుకొండ
చాలా బాగుంది మేడం…

పుట్టి. నాగలక్ష్మి
ధన్యవాదాలు ఉషారాణి గారూ!