అనుకుంటే…
అసాధ్య మేమీ కాదు,
అనుకోకపోవటంలోనే,
అంతరార్థం దాగిఉంది!
సమస్యలు
నీకూ ఉంటాయ్,
నాకూ ఉంటాయ్,
ఈ జీవన గమనంలో,
సమస్యలు
లేకుండా ఎలా వుంటాయ్!
సమస్యల వలయంలో,
దుఃఖం ఒకటే …
ప్రధానపాత్ర కారాదు,
వ్యథల భారంతో,
మనిషి మనుగడ,
చెదలు పట్టిన మెదడుగా
మిగిలిపోరాదు…!
అందుకే
వ్యథల వలయం నుండి
బయటికి రావాలి!
అయినవారితో…
ఆనందమైనా ,
దుఃఖమైనా,
పంచుకునే మార్గం
అలోచించాలి…!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
13 Comments
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
—–డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా.
పుట్టి. నాగలక్ష్మి
జీవిత సత్యం చెప్పారు డాక్టర్ సాబ్?! అభినందనలు




ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ.
గజవెళ్ళి శ్రీనివాసాచారి
సందేశాత్మక కవిత..అభినందనలు
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
sagar
యాదృచ్చికమేమో కానీ సర్ నేను ఈ రోజు వ్రాసిన స్వాంతన కవితకు దగ్గరగా అనిపిస్తూంది మీ కవిత. మీ లాగ క్లుప్తంగ మాత్రం నేను వ్రాయలేకపోయా. నిజమేకదా? పంచుకుంటేనే దుఃఖానికైనా, సంతోషానికైనా విలువ. మంచి కవితను అందించినందుకు ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అవునా
ధన్యవాదాలు సాగర్.
మొహమ్మద్ .అఫ్సర వలీషా
హృదయపూర్వక శుభాకాంక్షలు సార్ మంచి ప్రోత్సాహకర కవితను వ్రాశారు చాలా బాగుంది












మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి )
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అమ్మా
ధన్యవాదములు.
Shyam kumar chagal
మంచి సందేశం…కవిత రూపంలో
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యోస్మి
Rajendra+Prasad
Encouraging words sir
– Rajendra Prasad
sunianu6688@gmail.com
చాలా చక్కగా వివరించారు.మన బాధలు, సంతోషాలు పంచుకోవడానికి నిజమైన ఆత్మీయులు ఉంటే అదృష్టమే.ముఖ్యంగా మహిళలు ఒక వయస్సు వచ్చే వరకు సంసార భాధ్యతలో పడి స్నేహితులను పట్టించుకోరు.తర్వాత ఒంటరిగా మిగిలి పోతారు. ఇందులో పిల్లలు ని కూడా తప్పు పట్టాల్సినదిలేదు.కవిత చాలా సందేశాత్మకo గా ఉంది. రచయిత గారికి ధన్యవాదాలు






