ఆ రోజు రఘుబాబు ఇంట్లో ఉదయం నుండే సందడి మొదలైంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహోద్యోగులతో ఇల్లంతా కిటకిటలాడుతుంది. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు, కుశల ప్రశ్నలతో హోరెత్తుతుంది. అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తుంది. నవ్వులు పండుతున్నాయి. పుష్పగుచ్ఛాలతో, పూలదండలతో, దుశ్శాలువలతో రఘుబాబును సత్కరించేందుకు పోటీ పడుతున్నారు వచ్చినవాళ్ళంతా. ఈ తతంగాని కంతటికి కారణం లేకపోలేదు.
అంతకు ముందు రోజు సాయంత్రం – ఐ.ఎ.ఎస్. ఫలితాలు వచ్చాయి. రఘుబాబు ఐ.ఎస్.ఎస్.గా ఎంపికయ్యాడు. పైగా జాతీయ స్థాయిలో మొదటిర్యాంకు సాధించాడు.
అప్పుడే టి.వి. ఆన్ చేసిన రఘుబాబు ‘సాధన’ టీ.వీ. వాళ్ళు తన ఇంటర్వ్యూని ప్రసారం చేయబోతున్నారని ప్రకటించాడు. అంతే! ఒక్కసారిగా అందరి కళ్ళు టీ.వీ. పైన కేంద్రీకృతమయ్యాయి.
***
రిపోర్టర్: ఒక కుగ్రామంలోని, మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రఘుబాబుగారు, కష్టపడి చదువుకుని, స్వశక్తితో ఈ రోజు జాతీయ స్థాయిలో ఐ.ఎ.ఎస్. మొదటిర్యాంకు సాధించడం మన తెలుగువారందరికీ గర్వకారణం. అదెలా సాధ్యమైందో వారి మాటల్లోనే విందాం. రఘుబాబు గారూ! ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి..
రఘుబాబు: అలాగేనండి! మా నాన్న పెద్దగా చదువుకోకపోవడం వల్ల ఓ చిన్న ఉద్యోగం చేసేవారు. టెంత్ వరకు చదువుకున్న అమ్మ, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించేది. మేము ఇద్దరన్నదమ్ములం. నేను బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసరుగా జాబ్ చేస్తున్నాను. తమ్ముడు కూడా బ్యాంకు ఉద్యోగే. నాన్న తన ఉద్యోగ బాధ్యతలలో నిమగ్నమై వుండేవాడు. పిల్లల విషయం అంతా అమ్మే చూసుకునేది. చదివించడం, ఆడించడం, మంచీ చెడు చెప్పడం అంతా అమ్మే!
రిపోర్టర్: అయితే మీ అమ్మగారి ప్రభావం మీమీద చాలా వుంది.
రఘుబాబు: అవునండీ! ఇక్కడో విషయం చెప్పాలి. నాకు ఇద్దరు మేనమామలు. పెద మావయ్య బాగా చదువుకుని, బ్యాంకులో మేనేజరుగా పనిచేసేవారు. చిన మావయ్య అంతంత మాత్రం చదువుతో, ఊర్లోనే చిన్న వ్యాపారం చేసుకునేవారు. పెద మావయ్య పెద్ద ఉద్యోగం, మంచి ఇల్లు, కారు… చాలా ఉన్నత స్థాయిలో వుండగా; చిన్నమావయ్య చాలా తక్కువ స్థాయిలో వుండేవారు. పెద మావయ్య, చిన్న మావయ్యలకు ఉండే వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడేది. దాన్నే ఆసరాగా తీసుకుని, తన పిల్లల్ని శ్రద్ధగా చదువుకునేట్లు చేయగలిగింది మా అమ్మ. మాలో చదువు పట్ల శ్రద్ధ తగ్గుతున్నప్పుడల్లా… “మీరు పెద మావయ్యలా అవాలనుకుంటున్నారా? లేక చిన్న మావయ్యలాగా అవాలనుకుంటున్నారా? అని అడిగేది అమ్మ. “పెద మావయ్యలాగా అవాలనుకుంటున్నాము!” అని ఠక్కున చెప్పేవాళ్ళం. వెంటనే తను “అయితే ఆటలు ఆడడం తగ్గించి చదువులు మొదలుపెట్టండి!” అని మమ్మల్ని కట్టడి చేసేది. అలా ఒక విధంగా మా పెద మావయ్యే మాకు స్ఫూర్తి, ఆదర్శం.
రిపోర్టర్: అంటే… మీ ఉన్నతికి మీ అమ్మ ప్రత్యక్షంగా కారణమైతే, మీ పెద మావయ్య పరోక్షంగా కారకులన్న మాట!
రఘుబాబు: అవునండీ!
రిపోర్టర్: ఇక్కడో విషయం నాకర్థమవట్లేదు. ఒకే రక్తం పంచుకుని పుట్టి, ఒకే ఇంట్లో పెరిగినా, ఒకరు ఉన్నత స్థాయిలో వున్నారు… మరొకరు తక్కువ స్థాయిలో వున్నారు… మీ మావయ్యలు! ఇలా ఎందుకు జరిగింది?
రఘుబాబు: పెద మావయ్య చిన్నప్పటి నుండి చదువుపై చాలా శ్రద్ధ చూపించేవారట! కష్టపడి చదివేవారట! అలాగే, ఆటపాటల్లో కూడా తోటివారి కంటే ముందంజలో వుండేవారట! బడికి వెళ్లమని, చదువుకోమని, ఎవరూ చెప్పాల్సిన అవసరమే వుండేది కాదట! పెద మావయ్యకు చదువుపై అంతటి శ్రద్ధ, పట్టుదల వుండేవిట! అందుకే ఈ రోజు పెద మావయ్య బ్యాంకులో ప్రాంతీయాధికారి హోదాలో వున్నారు.
రిపోర్టర్: చాలా గొప్ప విషయం చెప్పారు మీ పెద మావయ్య గురించి. మరి మీ చిన మావయ్య ఎందుకు చదువుకోలేకపోయారు. వారిని కూడా చదివించాలనే ఉద్దేశం మీ అమ్మమ్మ, తాతయ్యకు ఉండేది కాదా?
రఘుబాబు: నో, నో, అలాంటిందేం లేదు! చిన మావయ్య చిన్నప్పటి నుంచి బడికెళ్ళనని మారాము చేసేవాడట! ఒకవేళ వెళ్ళినా, మధ్యలోనే ఎగ్గొట్టి, ఆటాపాటలతో కాలం గడిపేవారట! చదువుకోవడం లేదనే కోపాన్ని ఆపుకోలేక, మా తాతయ్య, చిన మావయ్యని గట్టిగా కొట్టారట! అప్పుడు మా చిన మావయ్య ఇంట్లోంచి పారిపోయాడట! ఇంట్లో వాళ్ళందరూ పిల్లాడు కనబడకపోయేసరికి, దిగులు పడుతూ, నిద్రాహారాలకు దూరమయ్యారట! ఎక్కడెక్కడో వెతికారట! ఎన్నెన్నో పూజలు చేశారట! ఫలితం మాత్రం శూన్యం!
ఉన్నట్టుండి ఒక రోజు చిన మావయ్య ఇంట్లో ప్రత్యక్షమయ్యాడట! అంతే, అందరూ చుట్టుముట్టి ఏడ్చారటా! ముద్దులతో ముంచెత్తారట! “నువ్ చదువుకోకపోయినా పరవాలేదు. మమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళొద్దు” అని చెప్పారట! అలా చదువుకు ఫుల్స్టాప్ పెట్టారట చిన మావయ్య!
రిపోర్టర్: అంటే… బాగా చదువుకుని మీ పెద మావయ్య ఉన్నత స్థాయికి ఎదిగితే, సరిగా చదువుకోని మీ చిన మావయ్య, దిగువ స్థాయికే పరిమితమయ్యారు… ఇకపోతే, బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఉద్యోగం చేసే మీకు, ఐ.ఎ.ఎస్. అవాలని ఎందుకనిపించింది?
రఘుబాబు: దానికీ మా పెద మావయ్యే కారణం. నేను, బ్యాంకు పి.ఓ.గా ఎంపికైనప్పుడు తనని కలిసి… “మావయ్యా! నేను కూడా మీ లాగే బ్యాంక్ ఆఫీసర్ అయ్యాను” అని చెప్పాను. అందుకాయన, “నాలాగే బ్యాంక్ ఆఫీసర్ అయితే గొప్పేంటి? నాకంటే గొప్పవాడివై కనబడు! అప్పుడు నిన్ను అభినందిస్తాను!” అంటూ నన్ను రెచ్చగొట్టారు! అంతే! నాలో పట్టుదల పెరిగింది. కసితో కష్టపడి చదివాను… సాధించాను… ఐ.ఎ.ఎస్.
రిపోర్టర్: ఏమైతేనేం… అనుకున్నది సాధించి, నేటి విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు! యు ఆర్ రియల్లీ గ్రేట్! అందుకోండి మా శుభాకాంక్షలు…!!
రఘుబాబు: చాలా థాంక్సండీ!!
రిపోర్టర్: చూశారుగా!!!
“జీవితంలో వెలుగులు నింపుకోవాలంటే… బాగా చదువుకోవాలి! ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే… బాగా చదువుకోవాలి!… కెమెరామెన్ సుదర్శన్‌తో… పరిమళ, చీఫ్ రిపోర్టర్, సాధన ట్.వీ.
***
టీ.వీ. ఆఫ్ చేసిన రఘుబాబు, తనకు చప్పట్లతో అభినందనలు తెలుపుతున్న అక్కడున్న వారందరితో కలిసిపోయాడు.

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
58 Comments
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , ante..Baala Sanchika lo , pillalakosam ,nenu vraashina ,”APPPUDOCHI KANAPADU” ane chinna kathanu prachurinchinanduku ,Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Sambasiva+Rao+Thota
Mee chinna kadha chadivanu.


Simple ga inspirational ga vundi.
Kashte phali anna essence tho rasinatlu anipinchindi.
Whatever the story be , either big or small, your stories will always carry grip and interest to the readers.
I thoroughly enjoyed sir
From
Sri BoseBabu
Hyderabad
Sambasiva+Rao+Thota
BoseBabu Garu!
Thank you very much for your encouraging and appreciating comments which I cherish a lot
Sambasiva+Rao+Thota
మార్గదర్శి – క్రమశిక్షణ, చదువు విలువ చెప్పిన కథ
బాగుంది సర్
From
Sri Jaya Baabu
Hyderabad
Sambasiva+Rao+Thota
JayaBabu Garu!
Thank you very much for your encouraging and appreciating comments which I cherish a lot
Sambasiva+Rao+Thota
Very nice story sir. It’s really inspiring for the children to come up in life.
From
Sri VenkannaBaabu
Hyderabad
Sambasiva+Rao+Thota
VenkannaBabu Garu!
Thank you very much for your encouraging and appreciating comments which I cherish a lot
MV Rao
Children can be influenced only till teens. A very good motivating story! Parents should spend more time with children. Unfortunately today’s generation does not have time for the spouse – so where do they have time for children? Then they shout, curse, blame it on fate etc.!
Sambasiva+Rao+Thota
Sri MV RAO Garu!
Thank you very much for your analytical observations and appreciation
Bhujanga rao
ఒక చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని,స్వశక్తితో జాతీయ స్థాయిలో ఐ ఏ స్ మొదట ర్యాంక్ సాధించటంలో దాని వెనుకాల ప్రత్యక్షంగా తల్లి,పరోక్షంగా మామయ్యల ప్రేరణ వల్ల చదువు విలువ తెలియ చేసిన కథ బాగుంది.కష్టపడి పని చేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయి మరియు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశాలు ఉంటాయని నిరూపించిన కథ సర్.మీకు ధన్యవాదములు మరియు నమస్కరములు
Sambasiva+Rao+Thota
BhujangaRao Garu!
Thank you very much for your understanding of the concept and appreciation
K. Sreenivasamoorthy moorthy
Sambasiva Rao garu mee ee aapudoche kanapadhu nice one andi. Very short one and cute one. One orientented on studies and to ignite the inheritent talent which is not explored and not utilised. Just like in Ramayana Hanuman’s confidence is boosted to reach him Lanka in search of mata Sita. Thanks for sharing such a nice one.

Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!
Thank you very much for your understanding the concept and appreciation
Sambasiva+Rao+Thota
stories are nothing but our Travel with the life which make us to add our ideas to it..
Good One…
From
Mr.Leelaa Krishna
Tenali
Sambasiva+Rao+Thota
Thank you very much Leelaa Krishna
Sambasiva+Rao+Thota
కథనం బాగుంది
. …కధ చప్పగా ఉంది

From
Sri RamanaPrasad
Hyderabad
Sambasiva+Rao+Thota
RamanaPrasad Garu!
Pillalakosam kadandee..
Konchem chappagaane vundaali mari..
Ayinaa,Meeku Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Nice
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasiva+Rao+Thota
Satyanarayana Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Nice Sir
From
Sri Venkateswarlu
Hyderabad
Sambasiva+Rao+Thota
Venkateswarlu Garu !
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Very good exposure of the realities of life
thanks and regards
M S RAMARAO
Manager retd
Central Bank of India
Hyderabad
Sambasiva+Rao+Thota
Rama Rao Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Very nicely drafted indicating motivation to the youngsters
From
Sri LakshmanRao
Hyderabad
Sambasiva+Rao+Thota
Lakshman Rao Garu!
Dhanyavaadaalandi
Sagar
నేటి తరాన్ని ఉత్సాహ పరచే కధ క్లుప్తంగ మీదైన శైలిలో వివరించారు. అభినందనలు సర్
Sambasiva+Rao+Thota
Dhanyavaadaalu Brother Sagar
Sambasiva+Rao+Thota
Oka manchi valuable message naku pampinanduku
Meeku chala thanks annaya
From
Mrs.Ramya
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramya
Sambasiva+Rao+Thota
Nice story, good inspiration for


children sir.
From
Sri Rameshwar
Hyderabad
Sambasiva+Rao+Thota
Rameshwar Garu!
Thank you very much
Sambasiva+Rao+Thota
చాలా బాగుంది.
Congratulations Sir
From
Sri Janardhanrao
Hyderabad
Sambasiva+Rao+Thota
Janardhanrao Garu!
Thank you very much
Sambasiva+Rao+Thota
Good following.
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
Thank you very much RamanaMurthy Garu
Sambasiva+Rao+Thota
నేటి తరాన్ని ఉత్సాహ పరచే కధ క్లుప్తంగ మీదైన శైలిలో వివరించారు. అభినందనలు సర్
From
Sri Saagar
Chennai
Sambasiva+Rao+Thota
Thank you very much Brother Sagar
Sambasiva+Rao+Thota
Very nice.
From
Sri Krishna Murty
Hyderabad
Sambasiva+Rao+Thota
Krishnamurthy Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Congratulations Sambasiva Rao Garu..
We are proud of you..
From
Sri Vishnu SankaraRao
Hyderabad
Sambasiva+Rao+Thota
Vishnu SankaraRao Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Chala motivate ga undhi uncle story
From
Mrs.Parameswari
Hyderabad
Sambasiva+Rao+Thota
Parameswari Garu!
Thank you very much…
Sambasiva+Rao+Thota
నువ్వే మావయ్య ఇక్కడ మన చుట్టాలందరికి,మరియు మన వడ్డ వల్లి కి ఆధారశమ్..సంచిక బాగుంది
From
Mr.Ravi
Sattenapalli
Sambasiva+Rao+Thota
Ravi!
Adi kevalam naapai neekunna abhimaanam maathrame!
Chinna pillalakosam nenu vraasina ee chinna katha neeku natchinanduku chaalaa Santhosham gaa vundi..
Dhanyavaadaalu…
P. Nagalingeswara Rao
సాంబశివ రావు గారు,పిల్లల కోసం మీరు వ్రాసిన కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. వారిని ఆలోసింపజేసి చదువులో సరైన మార్గంలో ఏంచుకుంటానికి సహాయపడుతుందని చెప్పటానికి సందేహములేదు.
Sambasiva+Rao+Thota
NagaLingeswararao Garu!
Thank you very much for your understanding and appreciation which I always cherish
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సాంబశివరావు గారూ
ఇది చిన్న పిల్లల కథ అనిపించలేదు నాకు.
యవతీయువకులను ప్రోత్సహించే సమాచారం..
పిల్లల స్థాయి ఇన్కా తక్కువ గా వుండాలేమో ఆలోచించన్డి.
ధన్యవాదాలు.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Meeru cheppina vishayam vaasthavame..!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Kadha uvatanu prabhavitam chhestumdi bagundi kadha
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Dhanyavaadaalu Seethakkaiah
Sambasiva+Rao+Thota
Chala Bagundi storey Apppudochi kanapadandi SHANKAR SINGER
Hyderabad
Sambasiva+Rao+Thota
Dhanyavaadaalu Shankar Garu
Sambasiva+Rao+Thota
Good Story..
From
Mr.D.Rajasekhar
Sattenapalli
Sambasiva+Rao+Thota
Thank you very much Rajasekhar
Sambasiva+Rao+Thota
Chaala bagundi sir. Title apt ga unnattu anipinchaledu. Katha bagundi.
From
Sri Thaathaarao P
Hyderabad
Sambasiva+Rao+Thota
ThathaRao Garu!
Thank you very much for your time in reading the story..
Also ,thank you for appreciating the story..
Much more thanks to you for advising me on the matter of title to the Story..
I assure you that special attention and care will certainly be evinced while finalising titles , hereafter..
Please continue your guidance in future also which I really need to improve myself..
Regards….
Arunakar Macha
కథా రచన చాలా బాగుంది సార్..