సంచికలో తాజాగా

లక్ష్మి చివుకుల Articles 1

రచయిత్రి లక్ష్మి చివుకుల గారు హైదరాబాద్‌లో వుంటారు. వీరి తొలి కథ 1984 వ సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో అది ప్రచురింపబడి వారికి సరి కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ప్రయివేట్ కంపెనీలో టైపిస్ట్‍గా చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసిన లక్ష్మిగారికి పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టమైన అభిరుచి. జీవితాన్నీ మనుషులనీ చాలా చదివారు. సాధారణ వ్యక్తిలా జీవిస్తూ ఉన్నంతలో  ప్రశాంతంగా వుండడానికి ఇష్టపడే వీరు సామాజిక స్పృహ ఉన్న కథలను రాయడానికి చేసిన ప్రయత్నమే తననొక రచయిత్రిగా నిలబెట్టింది అని నమ్ముతారు. ఆనాటి వార, మాస పత్రిక లన్నింటిలోను వారి కథలు దాదాపుగా ప్రచురితం  అయ్యాయి. కొంతకాలం విరామ రచయిత్రిగా ఉండిపోయి ఈమధ్యనే మళ్లీ కథలు రాయడం మొదలుపెట్టారు. సామాజిక స్పృహ ఉన్న ఏ కథ అయినా పాఠకుల అభిమానానికి నోచుకుంటుందని వీరి నమ్మకం. ఆ రకమైన కధలు రాయడం యిష్టం. వాళ్ళు మెచ్చిన కొన్ని కధలు రాయగలగడమే తనకు నిజమైన సంతృప్తి అంటారు. ఈ మధ్య వీరు రాసిన కొన్ని కథలతో 'కొత్త చివురు' కథా సంకలనం తీసుకువచ్చారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!