శ్రీనివాస భరద్వాజ కిశోర్ వృత్తిరీత్యా 17సం॥లు భారతదేశంలో శాస్త్రజ్ఞునిగా, తరువాత 26 సం॥లు అమెరికాలో టెక్నాలజీ మానేజ్మెంట్ లో ప్రభుత్వోన్నతాధికారిగా చేసి గత సంవత్సరం రిటైరయారు. అమెరికా టాలహాసీ నగర నివాసి. సంగీత సాహిత్యాలు ప్రవృత్తులు.
తెలుగులో మహాత్మా గాంధీ మీద ఒక చక్కనైన గేయాన్ని రచించి, సంస్కృతాంగ్లాలను మేళవించి, స్వరపరచి, సింఫానిక్ ఆర్కెస్ట్రేషన్ సమకూర్చి 62మంది భారతీయులు, 261 మంది అమెరికన్లుగల ఒక కోరస్‌ను సమన్వయపరచి, ప్రపంచ విఖ్యాతి చెందిన డా।।ఆండ్రె థామస్ సహకార కండక్టరుగా అమెరికా టాలహాసీ నగరంలో కండక్ట్ చేసి కచేరీ చేయించిన తొలి, ఏకైక తెలుగువ్యక్తి.
డా. సి. నారాయణరెడ్డిగారి ఆశీస్సులతో 'కిభశ్రీ' అన్న కలంపేరుతో కవితలు, ఛందోబద్ధమైన పద్యాలు, గజళ్ళు, పద్య నాటికలు, కథలు, రచనలు చేసే రచయత, గాయకుడు, సంగీత దర్శకుడు, శ్రీనివాస భరద్వాజ కిశోర్.
ఎన్నో అవధానాలలో పృచ్ఛకునిగా వ్యవహరించారు. ఎన్నో సంగీతరూపకాలకు, పద్యనాటికలు రూపకల్పన చేసి వాటికి సంగీతం సమకూర్చి, దర్శకత్వం వహించి ప్రదర్శింపజేసినారు. మధురవాణి వంటి అంతర్జాల పత్రికలలో చాలా రచనలు ప్రచురితమయినాయి. హాస్యప్రధానమైన పద్య నాటకాలు, కథానికలు రచనలు చేయడమంటే చాలా ఇష్టం.
పిల్లలకోసం చాలా గేయాలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో రచనలు చేసి, స్వరపరచి, రికార్డు చోసి, రంగప్రదర్శనలు చేశారు.
శ్రీ పులి శేషయ్య స్మారక సమితి వారు ఈయన పద్య సాహిత్య, రంగస్థల, సంగీత రంగాలలో దాదాపు ఐదు దశాబ్దాలు చేసిన సేవను గుర్తిస్తూ 'వాదరేళీరసధి' బిరుదుతో సత్కరించారు.
ఇది ఆర్. శ్రీవాణీశర్మ గారి స్పందన: *వందే గురు పరంపరామ్ అనే శీర్షిక కింద మీరు పరిచయం చేస్తున్న, వివిధ రంగాలకు చెందిన అనన్య సామాన్యమైన గురువులు…